నా అందాల జవ్వని
రచన::సరిత రవిప్రకాష్
నీవు నవ్వులు రువ్వాలి అవి పువ్వులుగా
పూయాలి నన్ను మురిపించాలి
ఉన్న ఈ నాలుగు రోజులు నవ్వుతూ గడిపెయ్యాలి నువ్వు నేను…..
ఆకుల పయ్యెదలో
నీ ఆడతనాన్ని దాచావేమో పూరేకుల్లో నీ సొగసుని
దాచావేమో,మొగ్గలో మురిపాలు నింపావేమో,
అన్నట్టుగా ఉన్నావు
ఓ సింగారమా….
అందుకేనేమో తోటలోని పూలన్నీ
నీ అందమంత అందంగా విరబుశాయి
పూలగాలి సువాసనల మత్తులో తేలిపోతున్నాను
నీ చూపుల కైపులో తూలిపోతున్నాను…
కొమ్మకు పూచిన పువ్వువో కమ్మని తేనెలు పంచిన జవ్వనివో ఓచెలి
నా అందాల చెలి….