మహా పర్వదినం

అంశం: చీకటి వెలుగులు

మహా పర్వదినం

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

“మహా పర్వదినం”
రైతన్నల, శ్రామికుల, పనికూలీల, శ్రామికుల పొట్టగొడుతున్న కరోనా,
రోడ్డు, రైలు, విమాన, జలప్రయాణాలను అష్టదిగ్భంధన చేసి ఊపిరి తీస్తున్న కరోనా,

రహదారులలో ఒంటరిగా పరిగెడుతున్న ‘అంబులెన్స్’ల
సైరెన్ ల మ్రోతలతో గుండె గుభిల్మానేల
ప్రజానీకాన్ని కలవరపెడుతున్న కర్కసి కరోనా,

వలసకూలీల దిక్కులేని బ్రతుకులు,
కంటికి ఒకరు రెప్పకు ఒకరుగా
చెల్లాచెదురు చేసిన రక్కసి కరోనా,

కుటుంబ వ్యవస్థను, దేశ ఆర్థిక వ్యవస్థను
కుప్పకూల్చి,కరాళనృత్యం చేస్తూ
మరణ మృదంగం మోగిస్తున్న పిశాచి కరోనా,

కానరాని సూక్ష్మజీవి అనంతమైన వ్యాధి బాంబుతో
భూమండాళాన్నీ కబళిస్తూ,
మానవజాతి మనుగడను నిర్వీర్యం చేస్తున్న క్రూర కరోనా,

ఆలయాల, చర్చిలు, మసీదులు ప్రార్ధనలు విన్న ఆ దేముళ్లు
“వైధ్యులై,రక్షక భటులై, పారిశుధ్యకార్మికులై”
నీ అంతానికి ‘వాక్సిన్’ అనే ఆయుధంతో
నిన్ను చీల్చిచెండాడి, మానవజాతి నవనిర్మాణం చేస్తారు,

నీ అంతమొందిన రోజును
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’
మహా పర్వదినంగా ప్రకటించనుంది,

“ఖభార్ధార్,కరోనా నీకు నువ్వే అంతమొందిపో,
లేదా మానవ నిర్మిత మారణయుధం
“వాక్సిన్ ” నిన్ను వెంటాడి, వేటాడి చంపుతుంది,
రేపో, మాపో ఆ “మహా పర్వదినం’ రానుంది.!
‘చీకటి వెలుగుల దోబూచులాటలో
విజయం మానవులదే!!!!!’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!