గాంధీయిజం

గాంధీయిజం

రచన : దొడ్డపనేని శ్రీ విద్య

ప్రపంచానికి పరిచయం అయిన *గాంధీయిజం*
ఆయుధం గా మారిన *సత్యాగ్రహం*

శాంతి అస్త్రాన్ని సంధించిన *జాతిపిత*
కోట్లాది మందిని ప్రభావితం చేసిన *మహాత్మ*

భారత మాత తల రాతను మార్చిన *విధాత*
భావి తరాలకు బంగారు బాట వేసిన *మహోన్నతులు*

నమ్మిన సిద్ధాంతం కోసం *ధర్మక్షేత్రం*

గాంధీజి సిద్దాంతాలు *స్పూర్తిదాయకం*
బాపు ఆశయాలు *అనుసరణీయం*
గాంధీ కలలు కన్న స్వరాజ్యం *స్మరణీయం*

దూరాచారాల నిర్మూలనలో *అనితర కృషి*
యావత్ భారతావనికి *దిక్సూచి*

నిద్రిస్తున్న జాతిని జాగృతం చేసిన *మార్గదర్శి*
బానిస బతుకులు కు చరమ గీతం పలికిన *సహనశీలి*

దొరలను తరిమి కొట్టిన *ధీశాలి*
సహాయ నిరాకరణ తో ఉత్తేజం నింపారు

సత్య శోధనే జీవితం అన్నారు
ఆత్మ శోధన కోసం నిరాహర దీక్ష చేసిన *సమరయోధులు*

నిజాయితీ, నిగ్రహం తో *పోరాటపటిమ*
సమాజ పురోగతికి *నిరంతర శ్రమ*

దేశాన్ని ఐక్యం చేయాలన్న *సంకల్పం*
హే రాం అంటూ నేల కొరిగిన *అమరులు*
దేశ ప్రజలకు మిగిలిన *తీరని శోకము*

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!