నాయనమ్మ

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

నాయనమ్మ

రచన:చెరుకు శైలజ

అమ్మమ్మ మేము సెలవులకి ఊరు వస్తున్నాం.
ఈ అని తెలిసి మా కోసం అన్ని తయారు చేసి పెట్టేది. ఎన్నో రకాల పిండి వంటలు చేసి పెట్టేది
. నేను చెల్లి అమ్మ కలిసి దసర పండుగకి, సంక్రాంతి పండుగకి ఎండాకాలం సెలవులకి వెళ్లేవాళ్ళం.
అలాగే మా మామయ్య పిల్లలు కూడా వచ్చేవారు.
మా కోసం అమ్మమ్మ మిద్దె మీద బంగోయి కట్టి ఉంచేది.
మేము ఆడుకోవడానికి చింతగింజాలు అన్ని ఒకే గంపలో పోసి పెట్టేది.
తాటి మట్టలతో బండి లాగా ఆడుకోవడానికి తయారు చేసి మాకు ఇచ్చేది
ఇలా అమ్మమ్మ మా కోసం ఏదో ఒకటి చేస్తునే ఉండేది.
మా అమ్మ ఎందుకే
అవి అన్నీ చెప్పినా వినేది కాదు.
ఈ వయసులో ఆడుకోపోతే ఎప్పుడు ఆడుకుంటారు .
అక్కడ మీ సిటీలో ఇవి అన్ని ఆడుకోవడానికి కుదురుతుందా అని నన్ను కోప్పడేది.
అంతా ఓపికగా వాళ్ళ తో నవ్వుతూ నవ్విస్తూ ఉండేది.
అమ్మ అలా ఆనందంగా ఉన్న అమ్మని
అమ్మమ్మ అంటు తన వెంటే తిరిగే నా పిల్లలను చూస్తూ ఉంటే నాకేంతో బాగుండేది .
ఒకరోజు నా పిల్లలు అమ్మతో అమ్మమ్మ నీవు అన్ని మా కోసం చేశావు కదా!
అలాగే మాకు ఒక మంచి కథ చెప్పు అమ్మమ్మ కథనా? అవును అమ్మమ్మ చెప్పు అంటు వెంబడి పడిన పిల్లలతో అనగనగా ఒక ఊరులో ఒక నాయనమ్మ
ఆ నాన్నమ్మకి ఒక పాము పుట్టింది. ఆ పామును అల్లారు ముద్దుగా పెంచుకుంటు ఉండేది .ఆ తరువాత ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పెళ్లి అయినాక అతనికి ఒక కొడుకు పుట్టాక
ఒక రోజు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఒక వరదలో కొట్టుకు పోయి చనిపోయారు
అప్పటి నుండి ఆ నానమ్మనే ఆ పిల్ల వాడికి అన్ని అయింది. అలాగే ఆ పామును కూడా బాగా చూసుకునేది.
ఆ ఊరిలో ఆ వింత గురించి అందరు చెప్పుకునేవారు.అందరు వచ్చి ఆ పాముని చూసి వెళ్లేవారు. ఆ పిల్లవాడు కూడా ఆ పాముతో ఆడుకునేవాడు.
ఆ బాబు పెరిగి పెద్ద వాడైయాడు.ఒక మంచి ఉద్యోగం చేస్తు చాలా ముసలామె అయిన నాన్నమ్మను కూడా బాగా చూసుకునేవాడు.
ఒకరోజు ఆ నాన్నమ్మ పాలు కాగబెట్టిన వేడి కుండను కుండ కుదురు అనుకొని చుట్టుకొని ఉన్న ఆ పాము పైన కళ్ళు సరిగా కనబడక పెట్టింది.
ఆ వేడికి ఆ పాము చచ్చిపోయింది.తరువాత ఆ పాము ఏది అని అంతా వెతికి చివరకు కుండ కింద చనిపోయిన ఆ పామును చూసి చాలా ఏడిచింది.
ఏమి చేయలేక మనసులో కుమిలి పోయింది.
అందుకే ఇప్పటికి ఎక్కడ పాము కనబడిన చంపవద్దు అని మీ తాతయ్య అనేవారు.
అలాగే ఇప్పటికి మన ఇంట్లో ఎక్కడ పాము కనబడిన మనం దండం పెట్టాలి .అది ఏమి అనకుండ వెళ్లి పోతుంది. ఇంతకి ఆ పాము పుట్టింది ఎవరికో తెలుసా
మీ తాతయ్య వాళ్ళ నాయనమ్మకి ఆ మనవుడే మీ తాతయ్య
అందుకే మన ఇంట్లో ఏ పాములు తిరిగిన చంపవద్దని వాటిని స్వేచ్ఛగా తిరిగనిచ్చేవారు.మరి అమ్మమ్మ అవి ఏమి అనవా మనల్ని వాటిని బెదిరించకపోతే మనవరాలు అడిగింది.
లేదు తల్లి వాటిని ఏమి అనుకోకపోతే మనల్ని ఏమి అనేవు.
అవి కూడా మన లాగే జీవులే కదా! అలాగే నాగుపాము కనబడితే దండం పెట్టుకోవాలి .వెళ్లి పోతుంది .
ఎందుకు అమ్మమ్మ……
నాగుపాము దేవత పాము
అవును శివుడు మేడలో పాముని ధరిస్తాడు అంటు మనవుడు యాక్షన్తో చెప్పుతువుంటే
ఇది జరిగిన కథ అంటు ముగించింది .
అమ్మమ్మ ఎంతో మంచి కథ చెప్పావు పిల్లలు ఇద్దరు అమ్మమ్మను సంతోషంగా ముద్దు పెట్టుకున్నారు.
సరే పొద్దు పోయింది ఇంకా పడుకొండి
మరల రేపు ఒక కథ చెబుతాను.
అంటు వాళ్ళని పడుకోబెట్టి జో కొట్టుతు వుంటే
అమ్మ ఇది నిజంగా జరిగిందా అంటు అడిగిన కూతురితో
అవునే జరిగిన కథే
మరి నాకు చెప్పనే లేదు.
నీకు మీ అమ్మమ్మ చెపుతుంది.
అమ్మ ఎందుకు చెప్పాలి . నువ్వు మాకు ఏమైనా కథ చెప్పావా ?
అమ్మమ్మ నే కదా చెప్పింది.
అంటు నా కూతురు మెల్లగా కళ్ళు తెరిచి అంటు ఉంటే
నేను మా అమ్మ మొఖాలు చూసి నవ్వుకున్నాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!