ప్రేమ మూర్తి మానవత్వం

ప్రేమ మూర్తి మానవత్వం

రచన : జీ.వి .నాయుడు

ఓ భారతావనీ ఏమిటీ ఈ దారుణం
మహా నగరం నిద్రిస్తున్న వేళ
గుర్తు తెలియని ఓ యువతి
చేతి నుంచి విసిరేయబడిన ఓ గోనె సంచె
ఓ ముళ్ల పొదలో పడివున్న తీరు
ఎందరో వాహన చోదకులు అటు వెళ్తున్నా
ఎవరికీ వినబడని గోనె సంచె ఏడుపు
ఆ మార్గంలో ఓ పాదాచారీణి
చెవుల్లో రింగుమన్న ఆ ఏడుపు
గోనె సంచె విప్పిన పసికందు
ఏడుపు
ఆ ప్రేమ మూర్తి కీ ఆగని దుఃఖం
పైట కొంగు లాగి చీరలో ఆ
పసికందుకు చోటు
తనతో పాటే తరలించిన యువతి
ఎవరుకన్నబిడ్డో అంటూ తల్లడిల్లిన యువతి
తల్లిగా అవతరించి మాతృ మూర్తి గా
పసికందుకు ప్రాణం పోసిన
మానవత్వం
ప్రేమ మూర్తి కీ అభివందనం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!