భయం గుప్పిట్లో ఊరు

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

భయం గుప్పిట్లో ఊరు

రచయిత :: నెల్లుట్ల సునీత

ఉస్మానియా క్యాంపస్ నుండి బయలుదేరారు సునీల్ సుదీర్ కిరణ్ వేదశ్రీ .కిరీటి రామాపురం అనే గ్రామానికి మూఢనమ్మకాలపై రీసెర్చ్ ఆర్టికల్ రాయడం కోసం ప్రాజెక్టు వర్క్ లో భాగంగా రామాపురం కి వెళ్లే దారిలో ఒక టౌన్ వస్తుంది అక్కడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది
టౌన్ నుంచి రామ పురానికి బయలుదేరాలి అంటే ప్రైవేటు ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆటోలు వెళ్తాయి ఆ గ్రామానికి

అప్పటికే రాత్రి సమయం 10 :30 అయింది టౌన్ లో బస చేద్దాము అంటే ఎలాంటి హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ లేవు

ఈ రాత్రి సమయంలో ఇక్కడ ఉండే వీలు లేదు కాబట్టి ఎలాగో ఒక గంటలో నడిచి వెళ్ళవచ్చు వెళ్దామా అని అన్నాడు సునీల్

అందరూ సరేనని బయలుదేరారు చిన్న కాలిబాట ఉంది నడిచి వెళ్తున్నారు
అంతా నిర్మానుష్యం గా ఉంది. చుట్టూ దట్టమైన అడవి పెద్ద పెద్ద వృక్షాలు ఎటు చూసిన గుట్టలు ఊర్లోకి వెళ్లే వరకు అక్కడ ఒక ఊరు ఉంటుందని ఎవరు గుర్తించరు కొత్తవారు

వడివడిగా నడుస్తున్నారు ఎక్కడో దూరంగా శబ్దాలు వినిపిస్తుంటాయి
నాకు చాలా భయమేస్తుంది అక్కడే ఉండాల్సింది ఈ రాత్రి సమయంలో ఇంత రిస్క్ తీసుకొని రావడం ఎందుకు అన్నది వేదశ్రీ

అవునురా వేదశ్రీ అన్నది కరెక్టే చూడు ఎంత చీకటిగా ఉందో ఈ చెట్లన్నీ జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా కనిపిస్తున్నాయి మనం ఒకరికి ఒకరు కూడా కనిపించట్లేదు ఏవేవో శబ్దాలు వినిపిస్తుంటాయి అన్నాడు సుధీర్

పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా నడవండి అంటూ ఆగండి ఆగండి చూడండి ఒకసారి అన్నాడు సునీల్ ఫర్లాంగు దూరంలో మంట కనిపిస్తుంది
ఈ రాత్రి సమయంలో అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా మంట ఎందుకు అనిపిస్తుంది ఎవరికీ ఏమీ అవసరం ఈ సమయంలో మంట పెట్టడానికి అని అందరూ అనుకుంటూ కొంచెం భయం భయం గా నాలుగడుగులు ముందుకు వేశారు

ఇంతలోకే పెద్ద గాలి వచ్చి గలగల శబ్దాలు చేస్తున్నాయి నేల మీద పడిన చెట్ల ఆకులు కిరీటి చేతిలో ఉన్న టార్చ్ వేసి చూశాడు
పెద్ద గాలి రావడంతో ఆకులు కొట్టుకుపోతూ కనిపించాయి అలా నడుస్తూ కొంచెం దూరం వచ్చారు అక్కడ ఒక వాగులో పెద్ద బండరాయి శబ్దం వినిపించింది

వెంటనే అందరూ టార్చ్ వేసి చూసారు
ఏదో పడ్డట్టు ఉంది కానీ ఏమీ పడ్డట్టు ఆక్కడా కనిపించలేదు అంత స్పష్టంగా కనిపించడం లేదు కానీ నీళ్ళు పైకి ఎగురుతూ ఉన్నాయి కదులుతున్నాయి

రాత్రి సమయంలో చేపలు వెళ్తుంటాయి అనుకొని అందరూ మళ్లీ నడవడం ప్రారంభించారు చెట్ల మీద ఉన్న గుడ్లగూబల అరుపులు కీచురాళ్ళ శబ్దాలు తోడేళ్ళ అరుపులు నక్కల అరుపులు వినిపిస్తున్నాయి
ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉంది చిన్న పుల్ల పడ్డ వినిపించేంత

జారిపోతున్న గుండెలు అరచేతిలో పెట్టుకుని నడుస్తున్నారు క్షణం క్షణం భయం భయం గా ఉంది వారు వేసే అడుగుల శబ్దం వారికే వినిపిస్తుంది

పక్కనే శ్రీగంధం మలబారు వేపలు ఎంతో భారీగా పెరిగి దయ్యాలకు చిరునామాలుగా కనిపిస్తున్నాయి

ఏదో నిలువెత్తు రూపం కదిలినట్టు అనిపించి పక్కకు చూశాడు సుదీర్
నల్లగా మనిషి ఎత్తు ఆకారంలో కనిపించింది టార్చ్ వేసి చూసే సాహసం కూడా చేయలేదు. లోలోపల భయం వేస్తున్న పైకి గాంభీర్యత నటిస్తూ ఓం ఆంజనేయం శ్రీ ఆంజనేయం అంటూ మనసులో నామస్మరణ చేసుకుంటూ గట్టిగా ఊపిరి బిగబట్టి నడుస్తున్నాడు

వేదశ్రీ కెవ్వున అరిచింది ఒక్కసారిగా
ఏమైంది వేద ఏమైంది అంటూ టార్చ్ వేసి చూసారు
వేదశ్రీ కాళ్లల్లో అడవి పిల్లి అడ్డు వచ్చింది

భయపడకు ఇది అటవీ ప్రాంతం కాబట్టే అడవి పిల్లులు అడవి పందులు తిరుగుతూ ఉంటాయి
ఇక్కడ రైతులుకు పంట నష్టం కూడా చేసి రైతులను కూడా ఎంతోమందిని చంపాయి అని విన్నాను అందుకే సాయంత్రం 6 దాటితే ఎవరు కూడా బయటికి రారు అన్నాడు సునీల్

కాళ్లకు ఏదో మెత్తగా తగిలినట్టు కెవ్వున కేక పెట్టాడు సుధీర్
ఏమైంది రా అంటూ టార్చ్ వేసి చూస్తే చనిపోయినా కాళ్లల్లో పడి ఉంది
ఒకసారి అందరికీ వణుకు పుట్టింది ఒళ్లంతా గగుర్పాటుతో
పాము చనిపోయి ఉంది కాబట్టి అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు గుండెలనిండా

మళ్ళీ ముందుకు నడవసాగారు ఏదో మసక వెలుతురు కనిపించింది వెళ్తున్న దారిలో అక్కడ ఏమై ఉంటుంది అన్నాడు సుధీర్

వెళ్తున్నాం కదా నాలుగు అడుగులు వేస్తే వస్తుంది ఏంటో చూస్తే సరిపోదా అన్నది వేదశ్రీ

అవును అంటూ అక్కడికి చేరుకున్నారు
ఏ ఆగండిరా ఒక్క నిమిషం అంటూ చేయి అడ్డం పెట్టాడు కిరీటి

అందరూ ఆగిపోయి టార్చ్ వేసి చూసారు ఉన్న దాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు

ఏంటి రా ఇవన్నీ ఈ రోజుల్లో కూడా అన్నాడు కిరణ్

అందుకే కదా మనం రిసెర్చి చేయడానికి వచ్చింది ఇదంతా గిరిజన ప్రాంతం కాబట్టి మూఢనమ్మకాలు ఎక్కువ అన్నాడు సునీల్

సరే గాని అక్కడ ఉన్న వస్తువులు ఏంటో చూడండి పరిశీలనగా దగ్గరగా చేసి చూద్దాం అన్నాడు సుధీర్ ఒక అడుగు ముందుకు వేసి చూస్తే

మోదుగు ఆకులు పచ్చివి విస్తరి కుట్టి ఆకులో కుంకుమ కలిపిన అన్నము ఒక పెద్ద ముద్ద చేసి ఒక సైడ్ పెట్టింది
అలానే బొగ్గు కలిపిన అన్నం ఇంకో ముద్ద పెట్టి ఉంది ఇంకో ముద్ద పసుపు కలిపి పెట్టి ఉంది మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఉంది చాలా సమయం అయింది ఏమో అందుకే దీపం గుడ్డి గా కనిపిస్తుంది నిమ్మకాయల తోటి కుంకుమ చల్లి కొబ్బరికాయలు పొట్టి ఏవో పాతబట్టలు వేసి ఉన్నాయి విస్తరి చుట్టూ బూడిద తో పొత్తి పోసి ఉంది

ఈ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు

తేరుకొని ఇదంతా మామూలే ఊరి పొలిమేరలో ఇలా దిష్టి తీసుకుంటారు అన్నాడు సునీల్

సరే కానీ పక్కనుంచి వెళ్దామంటే నడుస్తున్నారు కొద్ది దూరం వెళ్ళాక చెరువు కట్ట వచ్చింది అక్కడే ఒక పెద్ద మర్రి చెట్టు పెద్ద పెద్ద ఊడలతో దయ్యాలకు నిలయమా అన్నట్టు ఉంది .గబ్బిలాలు తిరుగుతూ శబ్దాలు చేస్తున్నాయి

అరేయ్ సుధీర్ గబ్బిలాలు మన తలమీదనే తిరుగుతున్నాయి అపశకునం అంటారు ఎందుకో భయంగా ఉంది రా అన్నాడు సునీల్

ఇంట్లో తిరిగితే శాంతి చేయించుకుంటారు అవును మంచిది కాదు అంటారు నిజమే అన్నాడు కిరీటి

పద పద ఊర్లోకి వెళ్లిన తర్వాత నీకు కూడా శాంతి చేపిస్తాను అంటూ సుధీర్
నడవండి అని తొందర పెడుతున్నాడు
అప్పటికే రాత్రి 12 గంటల సమయం అయింది

చెరువు కట్ట మీద నుండి కొంచెం దూరం నడిచారు ఏదో చప్పుడు విని ఆగిపోయారు
కట్ట మీదనే కాకతీయుల నాటి పురాతన శివాలయం ఉంది శివాలయంలో శివుడు వెళ్ళిపోయాడు అని ఎలాంటి పూజలు నోచుకోకుండా పాడు బడి ఉంది

మా ఊరి వాళ్ళు పగటిపూట శివాలయంలో కి వెళ్ళాలి అంటే ఇంతవరకు ఎవరూ సాహసించలేదు అలాంటిది నుంచి ఏదో మనుషులు ఉన్నట్టుగా చప్పుడు వెలుతురు వస్తుంది ఏంటి అని ఆలోచించసాగాడు సునీల్

సునీల్ మామయ్య గారి ఊరు కావడం వల్ల ఆ ఊరి గురించి వచ్చినప్పుడు ఎంతో కొంత సమాచారం తెలుసు

సునీల్ మామయ్య వరంగల్ లో సెటిల్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది

ఏమోలే ఏదో ఒక శబ్దాలు వినిపిస్తుంటే ఉన్నాయి కదా మనకు దారి పొడవునా ఇప్పటికే చాలా రాత్రి అయింది అన్నది వేదశ్రీ ముందుకు నడుస్తూ అందరూ ఆమెను అనుసరిస్తూ నడవసాగారు

చెరువు కట్ట గారు దిగారు అక్కడ మూడు నడకదారి బాటలు కనిపిస్తున్నాయి
కాలిబాటన వెళ్తే పక్క గ్రామం వస్తుంది ఇంకో కాలిబాటన ఒక తండా వస్తుంది. ఇంకో కాలిబాట రామాపురం ఊరు

కొంచెం దూరంలో ఎవరో మనుషుల అలికిడి వినిపించి ఆగిపోయారు

ఏవో మాటలు వినిపిస్తున్నాయి
ఒక్క నిమిషం ఎవరు మాట్లాడకుండా ఆగండి అన్నాడు సునీల్

ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది కానీ ఏం మాట్లాడుతున్నారో వినిపించట్లేదు స్పష్టంగా
సుధీర్ కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే మనము ఇక్కడ ఉండడం మంచిది కాదు రండి పక్కనే చెట్ల పొద ఉంది అక్కడికి వెళ్లి చూద్దాం టార్చి వేయకండి అన్నాడు

అందరూ సుధీర్ ని అనుసరిస్తూ చెట్ల ప్రజలలోకి వెళ్లి కూర్చొని దూరంగా ఉన్న దృశ్యాన్ని గమనిస్తున్నారు
నలుగురు మనుషులు తలా ఒక దిక్కు నిలబడి ఉన్నారు
ఒక మనిషిని కూర్చోబెట్టి ఇంకో మనిషి ఏదో చేస్తున్నాడు

ఈ టైంలో ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేస్తారు అబ్బా అన్నది వేదశ్రీ

నాకైతే హర్రర్ సినిమా చూసినట్టు భలే థ్రిల్లింగ్ గా ఉంది జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అన్నాడు కిరీటి నవ్వుతూ

చాల్లే ఆపు రా నీ పిచ్చి జోక్స్ నువ్వు ఇదేనా సమయం నవ్వుకోవడానికి అన్నాడు సుధీర్

ఈరోజు ఆదివారం అమావాస్య అందులో సూర్య గ్రహణం క్షుద్ర పూజల అనుకూల సమయం బహుశా అక్కడ జరిగేది కూడా అదే అనుకుంటా ఎందుకైనా మంచిది అక్కడికి మనం ఎవరం వెళ్ళవద్దు తెల్లవారినాక విలేజ్ కి వెళ్దాము అన్నది అనుమానంగా వేదశ్రీ

అవునురా వేద చెప్పేది కూడా నిజమే మనము అక్కడికి వెళితే దేనికైనా తెగిస్తారు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు ఏం చేస్తారో కూడా తెలియదు
వెళ్లకపోవడమే మనకు మంచిది అంటూ సలహా ఇచ్చాడు సుధీర్

భయం గుప్పిట్లో గడిపా మా అన్నట్టు గా ఆ రాత్రి గడిపారు తెల్లవారింది

పోలీసులు మీడియా పత్రికా వాళ్లు సంఘటనా ప్రాంతానికి వచ్చి చూస్తూ ఏదో రాసుకుంటూ అందరూ మొబైల్ తో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఊరంతా భయం గుప్పిట్లో అన్నట్లుగా ఊరు కదిలి వచ్చింది

ఏం జరిగిందో ఎక్కడ అని తెలుసుకోవాలని ఉత్కంఠతో ఉన్నారు జనమంతా గుమికూడి నెమ్మదిగా సుధీర్ సునీల్ కిరణ్ వేదశ్రీ కిరీటి అక్కడికి చేరుకున్నారు

అక్కడ దృశ్యం చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది నక్షత్రపు ఆకారపు ముగ్గు వేసి నిమ్మకాయలు ఎర్రటి కుంకుమ తో చల్లి నల్ల కోడి పిల్లను నల్ల మేకను బలి ఇచ్చినట్టు రక్తమంతా పడి ఉంది ఆ ప్రదేశమంతా చుట్టూ బొంగులు పోసి క్షుద్రపూజలు చేసినట్టు తెలుస్తుంది.

ఇదంతా పరిశీలనగా చూస్తూ ఉన్నారు
సుధీర్ సునీల్ కిరణ్ కిరీటి వేదశ్రీ

గుంపులో నుండి ఒకతను వచ్చి
ఎవరు మీరు ఊరికి కొత్తగా కనిపిస్తున్నారు మిమ్మల్ని ఎక్కడ చూసినట్లు ఇంత ముందు అనిపించటం లేదు ఎవరి ఇంటికి వచ్చారు అని అడిగాడు

సునీల్ పోలీసులను గమనిస్తున్నారు
ఎవరో వాళ్ల దగ్గరికి వెళ్లి ఏదో చెబుతున్నట్టు ఉన్నారు

సుధీర్ సమాధానం చెప్ప బోయే లోపే పోలీసులు పత్రిక వాళ్ళు కట్ట మీద ఉన్న శివాలయం దగ్గరికి వెళ్దాం పద ఉన్నారు

అక్కడ కూడా ఏదో జరిగింది అంట వెళ్దాం పదండి అని గుంపులు గుంపులుగా జనం కట్ట పొడవునా దారి కట్టారు
పోలీసులు పత్రిక వాళ్ళు పరిశీలనగా ఆ ప్రదేశం అంతా చూడసాగారు ఇంతలో ఒక దగ్గర ఇసుక ట్రాక్టర్లు కుప్పలుగా పోసి ఉంది ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళారు
రాతి బండలను తొలగించి 100 ట్రాక్టర్ల ఇసుక ఉంటుంది సుమారు కాబోలు ఉంది

ఇదంతా గుప్తనిధుల కోసం చేసినట్టున్నారు బాగా తెలిసిన వాళ్ళు ఈ పని చేసి ఉంటారు అంటే మామూలు విషయం కాదు ఇది

శివాలయం గురించి గుప్త నిధుల గురించి తెలిసినవారు ఈ పని చేసి ఉంటారు అన్నాడు అందులో ఒక పోలీస్ కానిస్టేబుల్

ఎన్ని రోజుల నుంచి ప్రణాళిక చేస్తున్నారు అసలు ఏమైనా దొరికాయా లేదో ఓ పత్రికా విలేకరి అన్నాడు

ఇంతలోకే ఒక పెద్ద మనిషి వచ్చి కానిస్టేబుల్ తో ఏదో చెప్తున్నాడు

పదండి అని ఊరిచివర ముత్యాలమ్మ గుడి ఉంటే అక్కడికి అందరూ కదిలి వెళ్లారు
గుడి పక్కనే ఒక వినాయకుడి విగ్రహం ఉంది ఒక వంద సంవత్సరాల క్రితం తెలుస్తుంది చూస్తుంటే
వినాయకుడి విగ్రహాన్ని పక్కకు తొలగించి లోతైన కొయ్యి తవ్వి ఉన్నది

ఒక్క రోజులో మూడు సంఘటనలు చోటుచేసుకున్నాయిఈ ఊరిలో ఉంటున్నాడు కానిస్టేబుల్
ఇదంతా ఎవరి పని అయి ఉండొచ్చు అని అందరూ వినిపించి విన పడనట్టుగా అంటున్నారు

ఏది ఏమైనా కేస్ ఫైల్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి పోలీసులు పత్రికా మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు.

ఇంత ముందు పలకరించిన అసలైన సుధీర్ వాళ్ల దగ్గరికి వచ్చాడు అయ్యా ఎవరి ఇంటికి వచ్చారా చెప్పనే లేదు అని అడిగాడు

పుల్లారావు గారిని వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పాడు సుధీర్

అక్కడున్న వాళ్ళందరూ గుసగుసలు ఏదో అనుకుంటున్నారు వాళ్లేం కొడుతున్నారో వినిపించట్లేదు సుధీర్ కిరణ్ వేదశ్రీ కిరీటి సునీల్ కి

ఆ ముసలాయన వచ్చి సునీల్ వాళ్ళ దగ్గరికి పుల్లారావు గారు ఎప్పుడో చనిపోయారు కదా వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు ఎవరు ఉండట్లేదు పుల్లారావు గారు భార్య ఉండే ఆమె కూడా చనిపోయి సంవత్సరం అవుతుంది
వాళ్ళ వంశములో అందరూ చనిపోయారు ఆ ఇల్లు పాడుబడి ఉంది. అటువైపుగా వెళ్ళాలి అన్నా మేము ఎవ్వరం వెళ్ళము
ఎవరున్నారని ఎందుకు వచ్చారు బాబు వెంటనే వెళ్ళిపొండి అయ్యా మీరు ప్రాణాలు కాపాడుకోండి అంటూ చెప్తున్నాడు ముసలాయన ఎంతో ఆర్తితో

ఎందుకలా చెప్తున్నారు అంటూ వేదశ్రీ ఒక అడుగు ముందుకు వేసి అతనిని అడిగింది

ఆ ఇంట్లో పెద్ద శక్తి ఉంది అమ్మ ఎకరం ఇల్లు ఉంటుంది 24 గదులు మా ఊరిలో పెద్ద ఇల్లు అంటే అదే ఆ ఇంట్లో ఉన్న వారు ఎవరూ బతికి బట్ట కట్టలేదు వంశమే మీరు వంశం అయింది. పసిపిల్లల దగ్గరనుంచి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చనిపోయారు మా కళ్ళ ముందే వాళ్ళ మనవడు పట్నం నుంచి దోస్తులం వెంటబెట్టుకుని వచ్చి వారం రోజులు ఇంట్లోనే ఉండి ప్రాణాలు కోల్పోయారు

కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్లు కూతుర్లు ఇలా ఏ ఒక్కరు లేరు వాళ్ళ వంశం లో ఇప్పుడు అందరూ చనిపోయారు అంటూ ఎంతో బాధపడుతూచెప్పాడు

ఆ ఇల్లు ఎవరు కొనటానికి కూడా సాహసించలేదు అలానే ఉండిపోయింది
ఈ ఊర్లో ఉండాలంటుంది భయంగా ఉంటుంది. బాబులు మీరు వెళ్లిపోండి తొందరగా అంటూ రండి నాతో పాటు ఆటోలు ఆగే ప్రాంతానికి తీసుకెళ్లి ఆటో ఎక్కించి జాగ్రత్తగా వెళ్లండి బాబులు అంటూ వెనుతిరిగాడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!