ప్రేమతత్వం
రచన: చెళ్ళపిళ్ళ సుజాత
అనంతమైన అభిమానం అంతులేని
అనురాగం జోడించి ఆప్యాతను
కురిపిస్తే పొంగి పొర్లేది ప్రేమతత్వం
కరుణ దయ ప్రేమతత్వానికి రెండు
కళ్ళలాంటివి భాగవంతునిపై
అంతులేని భక్తి భావాన్ని ప్రేమ తత్వాన్ని
కలిగి ఉన్న మీరాబాయ్ లాంటి భక్తులందరో
రాధాకృష్ణులు పవిత్రమైన పావనమైన
ప్రేమతత్వానికి నిలువెత్తు నిదర్శనం కాగా
శ్రీరాముడు పై ఆంజనేయునికి గల అమిత భక్తి
భావం కూడా ప్రేమతత్వానికి రూపమే
సేవతత్పరతతో కూడిన ప్రేమ తత్వానికి
మారుతి నిలువెత్తు రూపం
ప్రపంచమంతా ద్వేషాన్ని విడనాడి
ప్రేమను పంచగలిగితే
వసుధైక కుటుంబమే కాగలదు విశ్వమంతా