ఆకాశానికి నిచ్చేనలొద్దోయ్

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

ఆకాశానికి నిచ్చేనలొద్దోయ్

రచయిత :: మీసాల చినగౌరినాయుడు

నా ఆశల ఊహకు రెక్కలు తొడిగినపుడు
వాస్తవిక యానకాన్ని దాటి మృగతృష్ణలో
సంద్రాన్ని వెతుకుటకు నా స్వేచ్ఛాగీతిక ఆకాశానికి నిచ్చెనేస్తోంది..

ప్రవాహ ఉధృతిలో పదిలంగా పొర్లుతున్న
నీటి బుడగ తరంగరంగ గంగకు సాటిలేని పోటీ నేనని ఆకాశానికి నిచ్చెనేస్తోంది…

కకావికలం చేస్తున్న కనికరం లేని కరోనా వాయువులేక ఆయువులు పోతుంటే నియంత్రణ చేశామనే పాలకుల మాట
ఆకాశానికి నిచ్చెనేస్తోంది…

ఊహల తెరలను చీల్చుకొని
వాస్తవిక పాగా వేసుకొని
శ్రామిక కాడెను మోసుకొని
గమ్యస్థానం చేరుకొని
పదండి ముందుకు
నడండి ముందుకు
ఆకాశానికి నిచ్చెనలొద్దోయ్
ప్రగతిబాటకు నడుం కట్టవోయ్….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!