ఆశలకేమీ..?

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

ఆశలకేమీ..?

రచయిత :: జి.ఎల్.ఎన్.శాస్త్రి

ఎప్పుడూ ఆకాశానికి నిచ్చెన వేస్తుంటాయి,
అందుకునే చేతులకే కష్టం,
అందుకోటానికి ప్రయత్నించిన ప్రతీసారి,
కొన్ని సంఘర్షణలు కొన్ని గెలుపు ఓటములు,
అయితేనేమి …
పద …..
కొన్ని కలలు,కొన్ని ఆశయాలు..
సంచిలో వేసుకొని ఆకాశానికి నిచ్చెన వేసి,
లోకానికి చాటి చెబుదాం..
గుండె బలం ఉన్నవాడికి ,
ఓటమి అనే పదం ఉoడదని.
ఆత్మవిశ్వాసం మనదైనప్పుడు..
ఆకాశం వంగి సలాము చేస్తుంది.
సూరీడు ఇంటిముందు దీపమైపోతాడు.
చందమామ పెరటి లో మల్లెతీగఅయిపొతాడు,
మనమే లోకానికి వెలుగు దివ్వె అయ్యి,
దారి చూపుతామని నమ్మకాన్ని పెంచు,
భూమి నీ అరచేతిలో..ఆకాశం నీ పాన్పు.
ఇక నీ విజయానికి ఎదురే లేదు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!