అంశం: మనస్సాక్షి
అంతరాత్మ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన : కార్తీక్ దుబ్బాక
ధర్మా ధర్మ వివేకమే మనిషిని మాన్వితుడను చేస్తుంది,
అంతరాత్మ ప్రభోదంతోనే
మనిషి విజ్నుడవుతాడు,
తప్పోప్పుల నడవడికి మనసాక్షి, ఓ చురక
మనిషి చేయు చెడుకార్యాలకు
ఆత్మసాక్షి, ఒప్పుకుంటేదానవుడు, మానవుడే
వివేకం, ఆత్మ పరిశీలన చేసి ఆపితే మహనీయుడే, మానవుడు,
చెంచల మనసును మార్చేది అంతరాత్మ,
మనిషిని, మార్చేది మనసాక్షి
అది లేనివాడికి, ఆవేదన మిగిలిచ్చేది,
మనిషి అంతరాత్మ.