మార్పు కావాలంటే మనిషికి మనిషే చేయాలి సాయం

మార్పు కావాలంటే మనిషికి మనిషే చేయాలి సాయం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కార్తీక్ నేతి

ఎంత వెతికిన దొరకని మురికివాడ,
ఉత్తరం కూడా చేరుకోలేని బస్తి,
చాంతాడంత  కొండగుర్తులు చెబితే కాని
వెళితేగాని  దొరకదు  ఏ వీధి ,
ఆపత్కాల వాహనం సమయానికి చేరుకొక
ప్రాణాలు పోయినా దుస్థితి,
ఆర్కిటెక్చర్ ప్రతిమ మనసుని  కదిలించింది
వారి నిస్సహాయత పరిస్థితి ,
డిజిటలైసేషన్ చేసింది ప్రతి ఇంటి అడ్రస్ ని,
గూగుల్ మ్యాప్స్ లో క్రిస్టల్ క్లియర్ గా కనపడుతోంది
కొల్హాపూర్ మురికి  వాడలోని ప్రతి గల్లి,
సరైన సమయానికి చేరుకుంటోంది ప్రతి ఆన్లైన్ డెలివరీ,
స్కూల్ బస్సు లో వెళ్తున్నారు ప్రతి విద్యార్ది,
ప్రతి ఒక్కరి కళ్ళలో కనపడుతోంది అభివృద్ధి
తాలుకా సంతోషాల జావళి,
అక్కడితో ఆపలేదు తను ఆ పని బాధ్యతగా ముందుకు  సాగుతూ,
విధిగా ప్రారంబించింది “షెల్టర్ ఫర్ అసోసియేట్స్”  అను సంస్థని,
మరెన్నో మురికివాడలను తిసుకోవచ్చింది వెలుగులోకి,
మార్పు రావాలంటే మనిషికి మనిషే సాయపడాలని చాటి చెప్పింది
జివిత సత్యాన్ని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!