నమ్మలేని నిజం

(అంశం:”అపశకునం”)

నమ్మలేని నిజం

రచన:: దోసపాటి వెంకటరామచంద్రరావు

శంకర్రావు ఒక చిరు వ్యాపారి.ఏప్పటికైనా పెద్ద వ్యాపారస్తుడుగా మారిపోవాలనే కోరికుంది. ఎలా ఎదగాలనే ఆలోచనలతోనే ఉంటాడు. పెద్దగా చదువుకోలేదు గాని కావల్సినంత లోకజ్ఞానం
వుంది.లౌక్యం బాగా తెలుసు.మంచి సమయస్పూర్తిగలవాడు.కాకపోతే కొంచెం చాదస్తం కూడావుంది.మూఢనమ్మకాలు కూడా వున్నాయి. అతనికి తగిన ఇల్లాలే అనసూయ.ఇద్దరూ దొందుకు దొందే.అపశకునాలంటే చాలా అప్రమత్తంగా వుంటారు. బయటకు వెళ్ళెటప్పుడు నల్లబ్రాహ్మనుడు తెల్లకోమటి ఎదురుగా రాకూడదు.ఎదురోస్తే ఆరోజు అతనికి వ్యాపారంలో నష్టమొస్తుందని నమ్మకం.అలాగే పిల్లి ఎదురొచ్చిన వెనకకు మూడడుగులు వచ్చి బయలు దేరుతాడు.తుమ్ము తుమ్మినా ఆగిపోతాడు.అందుకే బయలుదేరేముందు ముందు అనసూయకు చూచి రమ్మని పంపుతాడు .ఆవిడ చూసి గ్రీన్సిగ్నల్ ఇస్తే అప్పుడు వెళ్తాడు.భర్తకు తగిన ఇల్లాలు అనసూయ.ఆవిడకి మంగళ గురు శుక్రవారాలలో వితంతువు ఎదురుపడకుండా
జాగ్రత్తపడుతుంది.ఒకవేళ ఎదురు పడిందో పదిసార్లు తన మంగళసూత్రాలను తీసి కళ్ళకద్దుకుంటుది. తానో పెద్ద ప్రతివతనని ఆమెపై ఆమెకు విశ్వాసం.పూజలు పునస్కారాలు బాగానే చేస్తారు దంపతులిద్దరు.వాళ్ళ ఈ చాదస్తానికి కారణం వాళ్ళకు పిల్లలు లేకపోవడమే.పిల్లలకోసం దంపతులు తిరగని పుణ్యతీర్ధాలు లేవు.కనపడిన ప్రతి స్వామీజీలను దర్శించుకోవడం కూడా ఒక నిత్యకృత్యమైపోయింది.ఎవరో నాటుమందు వాడితే పిల్లలు పుడతారని పక్కనవున్న పల్లెటూరిలో పదిమంది పిల్లలున్న పాపమ్మ దగ్గరకి వెళ్ళమన్నారు. అలాగే పసరుమందు వాడింది అనసూయ.ఫలించలేదు.ఇంకేవరో కోయదొర మూలికలిస్తే పిల్లలు కలుగుతారంటే అది ప్రయత్నించారు.ఆ మూలికా వైద్యం వల్ల పిల్లలు పుట్టలేదుగాని ఇద్దరూ రుబ్బురోళ్ళలా తయారయ్యారు.సంతాన సాఫల్యకేంద్రాలున్నాయని వాళ్ళకి తెలియదు పాపం.తెలిసుంటే అదికూడా ప్రయత్నించే వారేమో.అలా వాళ్ళకి చాదస్తం బాగా ఒంటబట్టేసింది.ఎవరో సలహ ఇచ్చారు బంధువుల పిల్లలెవరినైనా పెంచుకోమని.వాళ్ళ చాదస్తం తెలిసిన వాళ్ళెవరూ పిల్లల్ని పెంపకానికివ్వడానికి ముందుకురాలేదు.ఆనాధ శరణాయాలలో ప్రత్నించమన్నారు.దానికి దంపతులిద్దరికి ఇష్టంలేదు. డబ్బు సమయం రెండు వృధా అవడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు.అందుచేత వాళ్ళకి బంధువులు కూడా దూరమే.స్నేహితులుకూడా
తక్కువే. ఆరోజు ఎప్పటిలాగే ఉదయాన్నే లేచిపోయారు శంకర్రావు అనసూయలు.ఎవరి నిత్యకర్మలు వాళ్లు పూర్తి చేసుకొన్నారు.శంకర్రావు పూజ పునస్కారములు పూర్తిచేసుకొని తన దుఖాణంకి బయలుదేరబోతుంటే బుజంమీద బల్లిపడింది.అపశకునమని పక్కంటి వెంకట్రావు కంచికి వెళ్ళి బల్లులను తాకొచ్చాడని అతనిని తాకుతే సరిపోతుందని వెళ్ళాడు.ఎంతసేపు
తలుపులు బాదినా తీయడాయే.అన్నీ పుణ్యస్థలాలికి వెళ్ళాడు గాని కంచికి వెళ్లనందుకు తిట్టుకున్నాడు.ఇటుపక్కనున్న సుబ్బారావింటికి వెళితే ఆయనకీ శంకర్రావు లాగే చాదస్తేమే.అరగంట తరువాత తలుపుతీసాడు.శంకర్రావును చూసి ఎదో మొక్కుబడిగా పలకరించాడు.శంకర్రావు అదేమి బట్టించుకోకుండా అతని చెయ్యిని తాకి వెంటనే వచ్చెశాడు.ఒక ఐదు నిముషాలు తరువాత బయలుదేరబోతుంటే పెళ్ళాం తుమ్మింది.పెళ్ళాంవైపుగుర్రుగా చూడబోతుంటే అది జలుబు తుమ్ములెండని వెళ్ళమంది.సరేనని ఇంటి బయటకి వచ్చాడు.
ఎదురుగా ఎదురింటి ధర్మారావు అక్క విధవారాలెదురయ్యింది.మళ్ళాలోపలికి వచ్చి దుఖాణానికి ఆలస్యమవుతున్నందుకు ఎంత నష్టమో లెక్క లేసుకున్నాడు.ఇవాలెందుకిలాజరుగుతుందొనని ఆలోచనలో పడ్డాడు.మరో ఐదునిముషాలుండి బయలు దేరాడు.ఈసారినల్లపిల్లి ఎదురుపడింది.మూడడుగులు వెనక్కు వేసి
ఇక ఏమి ఆలోచించక బయలుదేరాడు. శంకర్రావు ఇంటినుండి దుఖాణానికి కనీసం పావుగంటైనా పడుతుంది.రోజు నడిచే వెళతాడు.కొన్నాళ్ళక్రితం ఒక డొక్కు సైకిలుండేది.అదిఇక నేను నిన్నుమోయలేనని మోరాయించిఃది.అదిమూలపడేశాడు.అప్పటినుంచి కాళ్ళకిబుద్ది చెప్పాడు.
కొంచెం త్వరగా వెళదామని నడకవేగం పెంచాడు. ఎదురుగా కుక్కలు రెండు ఒకదానిని ఒకటి తరుముకుంటు వస్తున్నాయి .వాటిని తప్పించుకుందామంటే వెనకనుంచి బైకుమీద వస్తున్నకుర్రాడొకడు తనని గుద్దేశాడు.ఇద్దరు పడిపోయారు. ఇద్దరికి గాయాలయ్యాయి.ఆసుపత్రికి ఎవరో చూసి తీసుకొని వెళ్ళారు.ఇంటికి కబురువెళ్ళడంతో అనసూయ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటు కన్నీరుకార్చుకుంటూ ఆసుపత్రికి చేరుకుంది.కిందపడిపోవడంతో భయానికి గుండాగిపోయందని శంకర్రావు చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు.దిక్కులేనిదానిలా అనసూయ ఎడూస్తూండిపోయింది ఆసుపత్రిలో.బైకు గుద్దించినకుర్రాడు తాలుకా వాళ్ళే శంకర్రావు కి అంత్యక్రియలుజరిపించారు. ఇది నమ్మలేని నిజం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!