నవ్వు

నవ్వు

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చెరుకు శైలజ

నవ్వు నాలుగు విధాల చేటు ఒకప్పుడు
నువ్వు ఆరోగ్యనికి ఔషధం ఇప్పుడు.
పగలపడి  నవ్వ వద్దు అన్నారు ఒకప్పుడు
ఎంతో గట్టిగా నవ్వితే అంత ఆరోగ్యం అంటున్నారు ఇప్పుడు
కొందరికి ఒకరిని చూసి నవ్వడమే తెలుసు
ఆ నవ్వే వారి ఆరోగ్యానికి ఉపయోగం కదా ఎప్పుడు
అందుకే నవ్వుతు నవ్విస్తూ బతకడమే జీవితనికి ఎంతో హాయి
కొందరు వారి సంతోషమే చూసుకుంటారు
ఇంకొందరు ఎదుటివారి సంతోషమే వారి సంతోషం గా భావిస్తారు
ఏది ఏమైనా మనం సంతోషంగా ఉంటు,
ఎదుటి వారిని సంతోషంగా ఉండేటట్లు చేయడం
మన ఆరోగ్యనికి  నవ్వు ఎంతో  ముఖ్యం.
అందుకే నవ్వుతూ బతకాలి
అందరికి ఆనందం పంచాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!