కరోనాలో కాముడి పెళ్ళి

అంశం : హాస్య కవిత

కరోనాలో కాముడి పెళ్ళి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

వినరండోయ్ వినరండి
అవక అవక అవుతున్న
మా కాముడి పెళ్ళి వైభవం వినరండి.
ముప్పై ఏళ్ళ కాముడికి
మూడు తరాల వారసుడికి
కరోనా లో ముప్పై మంది
పెళ్ళి వారితో ముచ్చటగా
మురిపెంగా, మూతికి గుడ్డలు కట్టుకుని,
చేతికి సానిటైజర్ క్షణ క్షణాన వ్రాసుకుంటు
దూర దూరంగ కూర్చుని
మాట మంతి లేకుండా
మూతికి గుడ్డతో పురోహితుడు చెప్పినదేదో
తెలియక పోయినా
వధువు మెడలో తాళి కట్టి
సైగలతో రమ్మన్నప్పుడు
ఒక్కరొక్కరు భయం భయంగా గ్లౌజ్ లు వేసుకున్న చేతులతో
అక్షింతలు వధూవరులపై
వేసి ఆశీర్వదించి మమ
అనిపించిన పెళ్ళి
వధూవరులు పురోహితులు, తల్లిదండ్రులు మాత్రమే తప్పదు అని ఆద్యంతం ఉన్న పెళ్ళి  వాటర్ బాటిల్
మరియు సానిటైజర్ సీసా ప్రతివారికి ఇచ్చి భయం భయంగా లేటు వయస్సులో కరోనా కాలంలో జరిగిన
కాముడి పెళ్ళి. జీవితాంతం మరువ లేని పెళ్ళి…..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!