అసంపూర్ణం
శ్రీదేవి విన్నకోట
ఒకరికొకరు తోడు నీడ.
తప్పుకి ఒప్పు తోడు
ఆదిత్యునికి ఉష్ణం తోడు
జాబిల్లికి వెన్నెల తోడు.
నింగికి నేల తోడు.
పచ్చనిచెట్లకు పశుపక్షాదుల తోడు
జ్ఞానానికి సిరి ధైర్యంబు తోడు.
తొలిపొద్దుకి మంచు బిందువుల తోడు.
ఆకలికి అమ్మ ప్రేమ తోడు.
పసిమి బంగారానికి మన మేనిఛాయ తోడు.
చక్కని పరిమళానికి మన నాసిక తోడు.
అందచందాల వీక్షణకు నయనాల తోడు.
ఇలా చెప్పుకుంటూపోతే ఈ సృష్టిలో,
ప్రతిఅంశము ఒకదానికొకటి తోడునీడ.
తోడు నీడ లేని మనిషి జీవితం అసంపూర్ణం.