కొత్త ఇంద్ర ధనస్సు

 కొత్త ఇంద్ర ధనస్సు

దాకరపుబాబూరావు

అవును!
ఇప్పుడు మిగిలింది మనమిద్దరమే
దిగులు వనాలమై ఎందుకు మొలకెత్తాలి..?
మళ్లీ ఓ!కొత్త గూడు నిర్మిద్దాం…..

రెక్కలు వచ్చాక పిల్లలెందుకు
తలిదండ్రులకొమ్మల్ని పట్టుకు వ్రేళ్లాడుతాయి..?
సృష్టి ధర్మం రెక్కలల్లాడించడమేగా…?

ఇప్పుడు మనం అలసిన విహంగాలమా…??
కాదు కాదు…
కొత్తగా మళ్ళీరెక్కలు విప్పార్చుకుంటున్న మలి సంధ్యలం కదా..?

ఏడు రంగుల ఇంద్రధనస్సు లో ఏ రంగూ ఏనాడైనావెలిసిపోతుందా..?
కేవలం మనలా సాయం సంధ్యల్లో అలసిపోతుంది అంతే….!

గుండెల పరితాపాన్ని ఉగ్గబట్టుకోవడం ఇప్పుడు ప్రకృతి మనకు నేర్పే ఓనమాలు….

ఉదయ సంధ్యలు మనల్ని పరామర్శించే బాటసారులు
అవి మనల్నిపలకరించి వెళ్తున్నప్పుడల్లా
ప్రకృతి ఒడిలో సేదతీరితెప్పరిల్లుదాం

ఇప్పుడు కాలం మనకొక చిరకాల నేస్తం
ఉచ్వ్వాసలునిశ్వాసలు మనకు వీడ్కోలు గీతం పలికే దాకా
నువ్వూ నేనూ… ఒకరికొకరం తోడూ-నీడ….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!