నువ్వు నిజం లా వుండు

నువ్వు నిజం లా వుండు

బిహెచ్.వి.రమాదేవి

నువ్వు యెంత అందంగా ఉండే దానివో తెలుసా!
పనిలోపడి కొప్పుతో ఓసారి, నండూరి ఎంకి లా !
తులసి కోటచుట్టూ తిరుగుతూ జారుముడి తో ఓసారి!
జడ కోసం కురులు దువ్వుతూ,
ఓరగా చూస్తూ విసిరే జడతో!
సాయంత్రం మల్లెల జడతో
ఆర్గండి తెల్లని చీరతో…
చంకన బిందె మోస్తూ, నన్ను చూసి పైట సర్దుకుంటూ,
చిరుకోపంతో తర్జని చూపిస్తూ..
నీ కాటుక కళ్ళు, నడుముపై ముడత ఓహ్! ఏమిచెప్పను!?
ఎలా గుండె విప్పను!!?
కడుపుతో భారంగా బుగ్గలలో మిసమిసలపచ్చదనంతో..
జన్మనిచ్చాక ఊయలలో వేస్తూ, తమలపాకు పెదవులు,
అసలు నాకోసం అలంకరించు
కోకపోయినా యెన్ని అందాలు
కానీ ఇప్పుడులిప్స్టిక్అందాలు, ఆభరణాలు,నగలు, పట్టుచీర
ఇవి నా మనసును తాకనే తాకవు ఎందుకో,!
మనం అప్పుడు ఏరోజు
నోటితో ప్రేమ చెప్పుకోలేదు,
కానీ అన్నీ గుండెకు తెలిసేవి,
ఇప్పుడు మాటలు మిగిలాయి,
హృదయంలో తడి కరువయ్యింది,
అందుకే ఏమి చెప్పకు!
నీవే నిజం,నిజం నీవులా,
ఎప్పటిలా వుండు!మైబెటర్హాఫ్!
ఎందుకంటే నాకు నీవే తోడు!
నేను నీకు ఎప్పుడూ నీడనే!
ఒకరు లేకున్నా మనం అసంపూర్ణమే! లవ్ యూ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!