ఎదో అలా నీ జ్ఞాపకాల నీడల్లో
ఎన్.ధన లక్ష్మి
నీ చేయి పట్టుకొని ప్రపంచాన్ని చూసాను..
నీ చేయి పట్టుకుని అందరినీ పరిచయం చేసుకున్నాను…
నీతో కలిసి అన్నీ ఆటలు ఆడుకున్నాను..
నువ్వే నా ప్రపంచం…
నువ్వే నా లోకం…నాన్న…
తలరాతలో లేని జీవితంలో
బతుకులో, ఎన్నటికి
అందుకులేని అమూల్యమైన కానుక….
నీ వీపు ఎక్కి ఆటలు ఆడుకున్నాను..
నువ్వు జోకొడుతుంటే అన్నీ మరిచి నిద్రపోయాను..
అలసి వచ్చిన నీ కాలుని నేను ఎక్కి ఊయ్యాలాట
ఆడిన క్షణాలు ఇంకా గుర్తేకే ఉన్నాయి..
అవే కదా నా తీపి జ్ఞాపకాలు…
ఎన్నో నీకు చెప్పాలని…
మరెన్నో నీతో పంచుకోవాలని..
ఇంకెన్నో నీతో అల్లరి చేయాలని
ఎప్పుడు కలలే కంటున్నాను
ఏమి చేయను నువ్వు లేని ఈ ప్రపంచంలో
అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి
అనుక్షణం నీ జ్ఞాపకాలతో సతమతమవుతున్న..
కానీ నువ్వు అందించిన బాధ్యత నన్ను నవ్వేలా..
నీతో గడిపిన జ్ఞాపకాలు ఆయుధంగా మార్చుకుని
పైకి నవ్వుతూ నవ్విస్తూ సాగిపోతున్న ..
నీ జ్ఞాపకాలే తోడుగా
నువ్వు నాతో గడిపిన క్షణాలు
నన్ను నడిపించే నీడగా అనుక్షణం అండగా
ఉంటూ కష్టాల్లో తోడునీడగా నిలుస్తున్నాయి