వింత వేదన

అంశం: హాస్యకవిత

వింత వేదన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నాగ మయూరి

అయ్యయ్యో బ్రహ్మయ్య
నాగోడుని నువ్వయినా వినవయ్యా
ఏమని చెప్పను!
ఎలా చెప్పను!
కని, విని ఎరుగని నా వింత వేదన…
ఈ తింగిరి బింగిరి పెళ్ళాంతో వేగలేక చస్తున్నానయ్యా
ఆకలేసి అన్నం పెట్టమంటే… అరగంటలో వండేస్తానంటూ వంటిట్లోకి వెళ్ళి
బల్లిని చూసి
లొల్లి చేసి /
కడుపే మాడ్చింది
కంటి నిండా నిద్రయినా లేకుండా
దోమలు కుడుతున్నాయని ఆగరొత్తులు వెలిగేస్తే…
వాటిని చటుక్కున ఆర్పేసి
పుటుక్కున భయటకు విసిరేసి /
దోమలు కుట్టకుండా ఉండాలంటే…..
దోమలు పడుకునే దాకా ఎదురుచూసి నిద్రపొమ్మంది
జీవితంలో ఆనందమే లేదంటూ నే వలవల ఏడుస్తుంటే…
బిరబిర వంటిట్లోకి లాకెళ్ళి, పొయ్యిమీదున్న కుక్కర్ ని చూపుస్తూ /
కింద మండుతున్నా ఎంతో హూషారుగా విజిలేస్తున్న దానిని చూస్తూ..
పక్కనే కూర్చుని విజిలేయడం నేర్చుకోమంది /
అందులోనే ఆనందముందంటూ హితబోధ చేస్తుంది
కోపంతో నేను గదిలోకెళ్ళి తలుపేసుకుంటే….
మారు మాట్లాడకుండా బయట నుంచి గడియే పెట్టి పస్తులుంచింది
నా బతుకే చిందర, వందర చిద్విలాసంగా మార్చేసి…
తన తింగిరి చేష్టలతో నలుగురిలో నను నవ్వులపాలు చేసేసి….
ఉత్తమ హాస్య రచయిత్రిగా పేరుపొందినట్లు పగటి కలలే కంటోంది
రావయ్య బ్రహ్మయ్య
దీని తిక్క కుదిర్చి…
ఇకనైనా నా తలరాతను మార్చయ్యా

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!