ఎప్పుడు ఒడిపోతాం

ఎప్పుడు ఒడిపోతాం

రచన :: రమాకాంత్ మడిపెద్ది

ఆలోచన ఆగినప్పుడు
ఆచరణ లో అనుమానం ముసిరినప్పుడు
కన్న కలను మరచినప్పుడు
అనుకున్న గమ్యం మార్చినప్పుడు
గమనం నుండి కన్ను మరల్చినప్పుడు
వెళ్ళేది ముళ్ళ దారి అని తలచినప్పుడు
ముళ్లు ఉన్నాయని ప్రయాణాన్ని ఆపినప్పుడు
వచ్చే మలుపుకు భయపడినప్పుడు
ఎత్తులు పల్లాలకు అడుగు తడపడినప్పుడు
అలుపు అన్న మాట మనసులో చేరినప్పుడు
ఇక చాలు! అని మెదడు మనసును నియత్రించినప్పుడు
ఎవడో వస్తాడు ఎదో చేస్తాడు అని ఎదురుచూసినప్పుడు
గెలవాలి అనే కసి చచ్చి  ఒక్కసారి పడపోగానే మళ్ళీ తిరిగి లేవకుండా నేను ఓడిపోయాను నీ ఓటమిని నువ్వే ఒప్పుకున్నప్పుడు ఆ క్షణం ఓడిపోతాం
గాలి పీలుస్తూ బతికున్నా చచ్చిన శవానివవుతాం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!