విశ్వశాంతి మంత్రము

విశ్వశాంతి మంత్రము

రచన:: నెల్లుట్ల సునీత

శాంతి మంత్రమే గొప్ప తంత్రము
సహృదయతకు స్వారుపము
ఆత్మీయతలకు చిహ్నము

బలపడును స్నేహ బంధాలు
దేశ ప్రగతికి పురోగమనం

ఆర్థిక వనరుల సూత్రము
మానసిక ఆరోగ్యానికి ఉల్లాసము
శత్రువులను జయించడంలో సిద్ధ హస్తము

విశ్వ జనులకు నిఘంటువు
ఆలోచనల సారము స్వచ్ఛ ప్రేమల సంకేతము
అందించును భవితవ్యము
పెరుగును విలువల శాస్త్రము
నవరసాలలో శాంతమె అమృత రసము
కోరుకుందాం విశ్వశాంతి మంత్రము
ప్రశాంత వదనానికి నిలయము

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!