సత్తెకాలపు సత్తెయ్య

సత్తెకాలపు సత్తెయ్య

రచన ::చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

ఆకాశ హార్మ్యాల కన్నా
పూరిగుడిసెలో ప్రకృతి సిద్ధంగా
బతకడం అదృష్టం…..

రసాయనాలు కలిపిన
కూరగాయలు తినడం కన్నా
ఆకులు అలములు తినడం వరం…

వాహనాలెక్కి అలసట ఎరుగని
ప్రయాణాలు చేయడం కంటే
ఉన్న రెండు కాళ్ళకి పని చెప్పడం ఉత్తమం…

భూమి గుండ్రంగా ఉంది
మన చేష్టలు కూడా గుండ్రంగా తిరిగి
పాత తరహా పద్ధతులే మేలై
మరలా సత్తెకాలపు సత్తెయ్యలవక తప్పేలా లేదు
ఎందుకంటే
కొత్త అలవాట్లతో అనారోగ్యం అంటుకుంది
పాత అలవాట్లలో ఆరోగ్య భాగ్యం దాగుంది…!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!