బాధ్యత కాదా

బాధ్యత కాదా

 రచన:నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు తో పాటు శుభ పరుగు పెడుతుంది.

భర్త బ్యాంకు లో చిన్న అటెండ్ ర్ ఉద్యోగము. శుభ మంచి సంగీత విద్వాంసురాలు పెళ్లి కాని రోజుల్లో ఒక స్కూల్ లో ఉద్యోగం చేసేది ఇంటి దగ్గర పాఠాలు చెప్పేది. అక్క కూడా సంగీతం పరీక్షలు పాసయ్యి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నది తల్లి తండ్రి లేరు. పిన తండ్రి స్వామి పెళ్లి సంభందాలు చూసేవాడు

పెద్దమ్మాయి సౌమ్య చాలా రోజులు కుటుంబ భాద్యతలు చూసి పెళ్లి చేసుకున్నది

అతను ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి చెల్లెలు అయిన మంచి ప్రభుత్వ ఉద్యోగిని చెయ్యాలి సౌమ్య ఉద్దేశ్యము మనిషి పుట్టే టప్పుడు ఉన్న రాత ఎవరికి తెలియదు

చాలా సంభందాలు చూసి చివరకి బ్యాంక్ లో అటెండ్ ర్ ప్రస్తుతము తరువాత పరీక్షలు రా సి క్లర్క్ అవుతాడని పినతండ్రి చెప్పాడు

హైదరాబాద్ లో జీడిమెట్ల లో ఒక ఇల్లు ఉన్నది అన్నగారు వేరే ఉంటాడు అక్కలక్ పెళ్ళిళ్ళు అయ్యి వెళ్లారు అంతా ఊళ్ళోనే అక్కడ అక్కడ ఉంటారు

పండుగ తోరణం కడితే అంతా వచ్చేస్తారు

శుభ కి అరేకరం పొలం కట్నం ఇచ్చారు అది మనుమలకే కానీ కూతురికి అమ్ము కునే అధికారం లేదు లక్ష పెళ్లి ఖర్చులకి ఇచ్చి పినతండ్రి అక్క కలిపి పెళ్లి చేసి పంపారు

పెళ్లి కొడుకు విగ్రహం లా తెల్లగా మాట్లాడ కుండ ఉన్నాడు పెళ్లి లో అంతా మన పిల్ల తోగరు దారం లా ఉంది

అత్తింటి వారు అంతా అందంగా బాగా ఉన్నారు శుభ మాత్రం తేలిపోయింది

సరే విధి రాత అల ఉన్నది సౌమ్య ఉద్యోగం ప్రభుత్వం కనుక చెల్లి భర్త ఉద్యోగం ప్రభుత్వం ధి చెయ్యాలని పట్టు వల్ల జరిగింది

కాల క్రమంలో శుభ కి ఒక పిల్లాడు పుట్టాడు పురుడు బారసాల అన్ని సౌమ్య ,అమె భర్త చూశారు
పిల్లని బొమ్మ సారి పెట్టీ అత్తింటికి పంపారు ఆతరువాత శుభ మళ్లీ పుట్టింటికి రాలేదు అనే కంటే వాళ్ళు పంపలేదు

పిల్లాడికి ఎనిమిది ఏళ్లు వచ్చాయి ఇంటి పని వంట పని సరి పోతోంది గడియారంలో పరుగు లాగానే జీవితము

శుభ భర్త శ్యామ్ మాత్రం ఒక పిల్లాడు చాలు మీ అక్క బావ రెండొ పురుడు పోయ్యాడం భావ్యం కాదు అలాగని ఇక్కడ పొద్దము అంటే చాకిరీ సాగదు నాకు సెలవు లేదు అని చెప్పాడు

శుభ ఎదురు చెప్పలేదు కారణం భర్త ఒక్క పిల్లాడిని పట్టించు కోడు ఇంకా పిల్లలు అనవసరము.అనుకున్నది

శుభ కి శీతాకాలం చలి పడదు ఇంకా అక్కడి వాతావరణం అందరికీ తెలుసు పని. మనిషి రాకపోతే ఇంటి పని చెయ్యాలి

రెండు రోజులు మూసిన కన్ను తెరిచే లా లేదు ఎదో తెలిసిన మందులు అక్కకి ఫోనే చేసి చెప్పి తెప్పించుకుని వేసుకు న్నాధి ఆయన కి చెపితే పర్వా లేదు తగ్గి పోతుంది అంటూ ఎదో ఇంట్లో ఉన్న పాత సీసా దుమ్ము తుడిచి ఇచ్చా డు

మా అమ్మ చెయ్యలేదు తొందరగా తగ్గించుకో అన్నాడు

ఇది విన్న పిల్లాడు రామ్ తండ్రి వంక తల్లి వంక చూసాడు.

తండ్రి విసురుగా తాళాలు తీసుకుని స్కూటర్ దగ్గరికి వెడుతుంటే కాళ్ళకి అడ్డం గా పట్టుకుని ఏడ్చి అమ్మకి మందు ఇప్పించి వెళ్ళు అని ఎడవడం మొదలు పెట్టాడు . చేసేది లేక భార్యను ఎక్కించుకుని స్కూటర్ పై హాస్పటల్ కి తీసుకెళ్ళి మందు ఇప్పించాడు ఇంటికి ఆటోలో పంపాడు

రామ్ తల్లిని ఓదార్చాడు నాన్న పెద్దవాడు అతనికి బాధ్యత లేదు తను చిన్నవాడు అయిన అమ్మ గురించి బాధ.

శ్యామ్ కి చిన్నప్పటి నుంచి భాద్యతలు అన్ని అక్కలు చూశారు అతనికి అంతగా తెలియదు సౌమ్య మాత్రం చెళ్ళిలి కోసం భాధ పడుతుంది ఎందరో ప్రైవేట్ ఉద్యోగస్తులు వస్తె తనే చెయ్యలేదు ఆఖరుకి ఈ సంబంధం కుదిర్చి భాద్యతలు ఉన్న కుటుంబంలో పడేసాము అని బాధ పడుతుంది.

భార్య ఇంటి పనుల్లో తేడా లేకుండా చెయ్యాలి వచ్చే పోయే ఇల్లు బంధువులు భాద్యతలు ఎక్కువ శ్యామ్ తల్లి పండుగ వస్తె కుతుళ్ల కి బట్ట లు కొంటుంది కానీ కోడలికి మనస్సు పూర్వకం గా ఎది ఇవ్వదు.

వంట వార్పు అన్ని శుభ చూడాలి ఎప్పుడు కొడుకుని కూర్చో బెట్టుకుని నువ్వు ఎప్పుడు పెడ్డవడువి అవుతావు ఎప్పుడు నన్ను బాగా చూసే రోజు వస్తుందా అని ఎదురు చూస్తున్న అంటున్నారు

ఎందరో శుభ లాంటి జీవితాలు సౌమ్య లాంటి అక్కలు ఉన్నారు

నానటి బ్రతుకు నాటకము లో ఎన్నో సమస్యలు అన్ని కూడా ఆడవాళ్లే పడాలి మగ వాళ్ళు ముఖ్య అతిథులుగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి

ఈ సమాజం లో భార్యలు నిరంతర శ్రమ చేస్తూనే ఉండాలి
అయ్యా ఎస్ అంటూ రెడీ గా ఉండాలి.
స్త్రీ జీవితంలో మార్పు లేదు ఒక పిల్లాడు చాలు వాడు ప్రయిజకుడు అయితే అంతే అనుకున్నది అలాగే శుభ కొడుకు విషయంలో చదువు విషయం లో ఎంతో శ్రద్ధ చూపింది .

తండ్రి శ్రద్ద పట్టక పోయినా శుభ కొడుకు పెంపకంలో మంచి చదువు చదివించి ప్రయిజకుడిని చేసింది కుటుంబంలో స్ర్తీ కస్టమ్ అనంతము అమె త్యాగమే శ్రీరామ రక్ష శాంతి శుభము.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!