అంశం:హాస్యకవిత
తస్మాత్ జాగ్రత్త
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
అత్తరు కోసం గబ గబ వెళ్లి
బిత్తరుపోయాను
తత్తరపాటుతో
ఉత్తర దిక్కుకు వెళ్లి(స్మశానం ఉంది)
చక్కెరకోసం తీసాను డబ్బా
చక్కని టీ కోసం అబ్బా
చక చకా మూతతీసాను ఆ డబ్బా
చక్కగా తీరా చూస్తే మెత్తని ఉప్పు డబ్బా
యాలికుల పొడి తెమ్మంది మా అత్త
యలకల పొడి అనుకొని తెచ్చా
గాభరాగా టీలో కలిపేసుకుంది మా అత్త
చెప్పాను మెల్లగా యాలికుల పొడి కాదత్త(అని)
ఇలా ఇలా నా గాబరా తో పడుతున్నాను అగచాట్లు
దిద్దుకుంటున్నాను పొరపాట్లు
అనుకుంటున్నాను ఇవి గ్రహపాట్లు
ఎప్పుడు తీరునో ఈ పాట్లు
ఇదేనమ్మా నా బాధ
ఇదేనమ్మా నా క్షోభ
అందుకే మా అత్తవారు నాతో
వుంటారు తస్మాత్ జాగ్రత్త అని