దారం ఆధారం

దారం ఆధారం

రచన::మక్కువ. అరుణకుమారి

అలసి సొలిసిన వేళ అమ్మలా లాలించే తోడు భార్య
నాన్నలా నడిపించే నీడ భర్త

అజ్ఞానాంధకారం ముసురుకునే వేళ,వెలుగిచ్చే పరంజ్యోతి భార్య
ఆ జ్యోతిని కొడిగట్టనీయని చమురు భర్త

ఆశయ సాధనలో చేయూత నందించే చెలిమి భార్య
ఆ చెలిమి కొలనును చిరకాలం ఎండనీయని చలిచెలమ భర్త

అందని ఎత్తులకు ఎదిగే గాలిపటం భర్త
అతనిని వెన్నంటి నడిపే దారం ,ఆధారం భార్య

భర్తకి భార్య కావాలి బలమైన తోడు
కారాదు బలహీనతల నీడ
భార్యకి భర్త కావాలి బలమైన భరోసా
కారాదు భారమైన నిరాశ

కష్ట,సుఖాలలో,కలిమిలేములలో ఒకరికి ఒకరు
తోడు ,నీడై నిలిచే పవిత్రబంధం
వివాహబంధం ,అదే భార్య, భర్తల బంధం
వారే ఒకరికి ఒకరు నిజమైన *తోడు నీడ*

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!