ఆది గురువు

ఆది గురువు

రచన :: పి. వి. యన్. కృష్ణవేణి

ఏ జీవికైనా ఆది గురువు అమ్మే
ఏ ప్రాణికైనా తొలి ప్రేమ అమ్మదే
ఆలనాపాలనా అమ్మే చూస్తుంది
అండాదండా తానై నిలుస్తుంది

భాద నీదైతే కన్నీరు నాది అంటుంది
శ్వాస నీదైతే ప్రాణం తనదంటుంది
భాష నీది భావం తనదవుతుంది
నిలువునా నీ కోసం దహించే కొవ్వొత్తి నేనంటుంది

అమ్మ ఒడిలో అక్షర సుమాలు
నువ్వు నడిచే దారిలో కుసుమాలు
నీ జీవితానికి అవే కోటి తారకలు
నీ మదిలో వెల్లివిరియాలి సంతోషాలు

ప్రేమ కాంతులు వెల్లివిరుయును ఆమె కన్నుల్లో
ప్రేమ ఉప్పొంగును ఆమె హృదయంలో
నీ సుఖమే ఆమెకు ఓ వరం
ఆమెను నువ్వు ఉపేక్షిస్తే ఆమెకు అదే ఓ శాపం…

కంటతడి పెట్టించకు ఆమెను
నువ్వే ఆ కంటి పాపవు కదా!!
పల్లెత్తు మాట అనకు తనని
నువ్వే తనకు తెలిసిన ప్రపంచం మరి….

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!