వదిలారనుకోకురా

వదిలారనుకోకురా

రచన:ఉండవిల్లి సుజాతా మూర్తి

ప|వదిలారనుకోకురా..వదిలారనుకోకు||2||

నిన్నొదులుట కాదు అది||2||

నీకే వొదిలేయుట
నిన్నొదులట కాదు అది
నీకే వొదిలేయుట
వదిలారనుకోకురా వదిలారనుకోకు

చ|ఇక్కడక్కడనిలేక ఉమ్మివేయుటేమిటది||2||

ఒక్కరిద్దరంటుంటే నలుగురెక్కుతున్నారే

అమ్మా!తల్లీ!అని చెప్పినవన్నీ
బేఖాతరు చేసేవు బతుకిలా బేజారు|వది|

చ|ఎక్కేందుకు రైళ్ళు పోన్లే అని పార్సిల్స్

ఇచ్చారని యథేచ్ఛగా నువ్వుంటానంటెట్టా
కాస్తైనా ఇంగితం పాటించి చూడు
కొంపముంచు అనర్థాల కౌగలించుకుంటావా|వది|

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!