నువ్వుల జల్లులు  

అంశం: హాస్య కవిత

నువ్వుల జల్లులు  
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

పున్నమి వెన్నెలలో
చల్లగాలి వీస్తున్న వేలల్లో
కోయిల రాగాలు వినిపిస్తుంటే
కొంటే అల్లరి ఈలలు వేస్తుంటే
తుంటరి వయస్సు అల్లరి చేస్తుంటే
అందాల చిన్నది నా చెంతన ఉంటే
చెలి వెచ్చని కౌగిలి తోడు ఉంటే
సన్నజాజి పువ్వులు సైగలు చేస్తుంటే
అల్లరి పిల్ల గుసగుసలాడుతుంటే
అల్లరి చందమామ నవ్వుతుంటే
చెప్పలేని ఆనందం ఎగసి పడుతుంటే
సొట్టపోయిన బుగ్గను ముద్దాడుతుంటే
మనసు ఆనందంతో గోదారమ్మ లా
ఉరకలు వేస్తుంటే ఏంటి మామా
నీలో నువ్వే సిగ్గు పడుతున్నావు ఏంటి
మామ నవ్వుతూ మామ బుగ్గ గిల్లింది
ఎంటోనే  నాకదోలా ఉందే సిగ్గుతో
కళ్లు మూసుకుని లచ్చి చెవిలో
గుసగుసలాడాతుoటెే ఇద్దరూ నవ్వుకున్నారు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!