నిరర్థక స్వప్నాలు

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

నిరర్థక స్వప్నాలు

రచయిత :: చంద్రకళ. దీకొండ

పునాది లేని మేడలు…
ఆకాశానికి నిచ్చెనలు…
గాలిలో దీపాలు…
కృషి అంటూ లేని కలలు…!

ప్రక్కవారితో పోల్చుకొంటూ…
అసూయాద్వేషాలతో రగిలిపోతూ…
లేనివి ఊహించుకొంటూ…
ఉన్నవి కాలదన్నుకొంటూ…
అమ్మమ్మ కథలోని గొర్రెల
కాపరి కన్న స్వప్నాల్లా…
నిరర్థక స్వప్నాలే…!

స్వప్నాల సాకారానికి కావలసినవి…
దీక్ష ,పట్టుదల,
ఆత్మవిశ్వాసాలు…!

పగటికలలు పనికి చేటు…
దృఢనిశ్చయం లేని కలలు
భావిజీవితానికే చేటు…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!