నా ఊహల్లో

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

నా ఊహల్లో

రచయిత :: శ్రీదేవి విన్నకోట

ఆకాశానికి నిచ్చెన వేస్తు
అవకాశం కోసం చకోరంలా
వేచి చూస్తున్నా
సూర్యునిలా వెలిగిపోవాలని
జాబిల్లిని అందుకోవాలని
ఆకాశం నుంచి నక్షత్రాలను తుంచాలని
వెన్నెల మొత్తం మా పెరట్లో బంధించాలని
మేఘాలతో పరుగులు పెట్టాలని
ఉరుములు మెరుపులంత బిగ్గరగా అరవాలని
కరుగుతున్న కాలాన్ని ఆపేయాలని
ఎన్నో ఆలోచనలు
సమయాన్ని దోచేస్తుంటే
నా ఊహలకు వచ్చే
రెక్కలు ఆగేనా
ఏదో సాధించాలనే తపనతో
అందరాని ఆశలెన్నో నిరాశల ఆవిరులై పోతుంటే
ఆకాశం నువ్వు నన్ను అందుకోలేవులే అని ఎగతాళి చేస్తూ,నిచ్చెన నాకు కాదు, కళ్లెం నీ మనసుకు వెయ్
అని హెచ్చరిస్తుంటే అంతటితో నా ఊహలు ఆపేశా.

You May Also Like

One thought on “నా ఊహల్లో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!