బంగరు బాల్యం

బంగరు బాల్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : సావిత్రి కోవూరు

నీలాకాశపు నీడలలో, హరిత వర్ణపు వనములలో,
గాలిలో తేలుతు కేరింతలతో,
గడబిడ గడబిడ పరుగులు పెడుతు
పడుతు లేస్తు, ఎగురుతు, గెంతుతూ
కల్లాకపటం తెలియని మనుషులు,
కల్మషమన్నది తెలియని మనసులు,
ఆడుతు పాడుతు పరవశం మందే ఆనందపుటంచుల ఉల్లాసాలు,
పసిడి మనసుల బాల్యపు క్రీడలు
ఉత్సాహాల,ఉరుకులు పరుగులు,
ఆటలలో ఆనందపుటంచులు
నింగికెగిసినా సంతోషాలు
రాళ్ళు రప్పల రహదారులు కానని,
ఆకలిదప్పులు దరికే రాని,
బంగరు బాల్యపు చేష్టలు
చిలిపి నవ్వుల చెలిమలు
ఇదియే కదా బంగరు భవితకు
మధుర జ్ఞాపికలు, మళ్లీ రాని మంచి రోజులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!