టీచర్

టీచర్

రచన: సుశీల రమేష్.M

కరోనా వైరస్ పుణ్యమా అని స్కూళ్లు మూతబడ్డాయి. కానీ టీచర్స్ ఆన్లైన్ క్లాసులు స్కూల్ నుండే నిర్వహించాలనే నియమం పెట్టారు. క్లాస్ చెప్పేటప్పుడు అసలు స్టూడెంట్స్ వింటున్నారో లేదో కూడా అర్థం కాదు. క్లాస్ జాయిన్ అయిన తర్వాత ప్రజెంట్ మామ్ ఈ మెసేజ్ పెట్టిన స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు.

పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు నేను చాలాసార్లు పేరెంట్స్ తో చెప్పాను ఇప్పటివరకు. స్టూడెంట్ క్లాస్ ని హోల్డ్ లో ఉంచి గేమ్స్ ఆడుతూ ఉంటారు. పేరెంట్స్ గమనించాలి. చాలామంది పేరెంట్స్ అంటారు టీచర్ సరిగా చెబుతున్నారో లేదో అని, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో చూస్తున్నారు కదా టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారు.

నా పేరు పూర్ణిమ నేను హిందీ టీచర్. ఏ విషయమైనా సూటిగా చెప్పడం అలవాటు నాకు.

ఇక ఇన్స్పెక్షన్ అప్పుడు స్టూడెంట్స్కి డిసిప్లేన్ గా ఉండాలని ముందే చెప్పినా , స్టూడెంట్స్ కన్నా వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా మాట్లాడతారు. అదే ఏమైనా పేరెంట్స్ టీచర్ మీటింగా?
కొంచెమైనా బుద్ధుండక్కర్లా . ఇన్స్పెక్షన్ లో ఇతర స్కూల్స్ ప్రిన్సిపాల్స్ పాల్గొంటారు. అలాంటప్పుడు మా స్కూల్ కి మార్క్స్ తక్కువ ఇస్తారు. కొంచెం అయినా పేరెంట్స్ కి బుద్ధుండక్కర్లా.

మా స్కూల్ కి తక్కువ మార్క్స్ వస్తే
అప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మమ్మల్ని చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టమొచ్చినట్లు ఎన్నో మాటలు అంటారు. దొరికిందే వంక అనుకుంటూ.

హోంవర్క్ ఇస్తే నేమో ఇచ్చారు అంటారు. ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటా రు పేరెంట్స్. హతవిధీ కొంతమంది పేరెంట్స్ పిల్లలు హోంవర్క్ చేస్తుంటారు. ఇది ఎంత మాత్రం సబబు కాదు. ఎందుకంటే పిల్లలు లెసన్ విన్నాక ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియడానికి సొంతంగా రాయమంటారు హోంవర్క్ రూపంలో టీచర్స్.

అందరూ అనుకుంటారు చెప్పినా చెప్పకపోయినా జీతాలు తీసుకోవడానికి వస్తుంటారు టీచర్లు అనుకుంటారు కాదండి. మేము కూడా మా వృత్తి పట్ల అంకిత భావంతో పని చేస్తాము. మీ లాగే మాకు కుటుంబాలు ఉన్నాయి. మీ పిల్లలను మా పిల్లలుగానే భావిస్తాము.ఉదయం 9 నుండి మధ్యాహ్నం మూడు వరకు పాఠాలు చెప్తూ పిల్లలు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికతో సమాధానాలు చెప్తాము. కానీ ఇప్పుడు పేరెంట్స్ పిల్లలు ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత లెసన్స్ వింటున్నారో లేదో అని ఒక్క అరగంట టైం మీ పిల్లల కోసం వెచ్చించ లేకపోతున్నారు. ఇంట్లో ఉండి కూడా.

అందుకే నేను ఏం చేస్తానంటే క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఇచ్చిన హోం వర్క్ స్టూడెంట్స్ చేశారా లేదా అని పేరెంట్స్ ని చెక్ చేసి నాకు చెప్పమంటాను.

ఏ ఒక్క స్టూడెంట్ కూడా చదువులో
వెనకబడకూడదు. అలా ఏ టీచర్ కూడా ఆలోచించరు. వెనుకబడిన పిల్లల చేత సాధన చేయించాలి. ఎందుకంటే పిల్లలందరికీ తెలివితేటలు ఒకేలా ఉండవు. ఒకరికి ఒకసారి చెప్తే సరిపోతుంది. ఇంకొకరికి పదిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ సహనాన్ని కోల్పోకూడదు టీచర్లు. తరగతి గదిలోని ప్రతి విద్యార్థి బాధ్యత ఆ తరగతి టీచర్ దే.

ఇన్స్పెక్షన్ అప్పుడు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చేసిన రభసకు గాను టీచర్స్ అందరికీ క్లాస్ పీకడానికి మా ప్రిన్సిపాల్, సెక్రెటరీ ( అంటే డిఐజి) మీటింగ్ అరెంజ్ చేశారు . సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి టీచర్స్ ని. “ఆ నేను ఊరుకుంటానా” ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ అన్ని రికార్డ్ చేయమని మా కంప్యూటర్ సర్ కి టెక్నికల్ టీం కి ముందే చెప్పాను.
ఆ రికార్డ్స్ అన్ని చూసిన ప్రిన్సిపాల్ గారు సెక్రటరీ గారు, మమ్మల్ని ఏమీ అనలేక వెళ్లిపోయారు….

మా సీనియర్స్ అంతా నన్ను, వెల్డన్
పూర్ణిమ ఈ వీడియోస్ గనుక చూసి ఉండకపోతే సెక్రెటరీ గారు మన అందరిని కలిపితిట్టేవారు, చిన్నదానివైనా నీ ముందు చూపుకు
మా సీనియర్స్ అంతా నీకు జోహార్లు పలుకుతున్నాం అన్నారు. ఇక మా జూనియర్ టీచర్స్ కి ఏడుపు ఒకటే తక్కువ. ఒకరిద్దరు ఏడ్చేశారు కూడా. ఇదంతా నేను మెప్పుకోసం చేయలేదు నిజానిజాలు తెలుసుకోకుండా టీచర్ల మీద నింద మోపే వారికి గుణపాఠం చెప్పాలని చేశాను. మీటింగ్ అయ్యాక ఇంటికి బయల్దేరాను నా స్కూటీ మీద.

స్కూల్ ముందు బస్ స్టాప్ నుండి వెళ్లాలి. అక్కడ ఒక హిజ్రా బస్సు కోసం వెయిట్ చేస్తున్నట్లు ఉంది. నేను వస్తుంటే నన్ను ఆపింది హిజ్రా. మేడమ్ నా పేరు గీత మా నాన్న గారికి ఆక్సిడెంట్ జరిగింది నాకు ఫోన్ చేశారు హాస్పిటల్ వాళ్ళు లాక్డౌన్ వలన బస్సులు లేవు. ఆటోకు వెళ్దామంటే ఒకటి లేదు, నా అవతారం చూసి ఎవరు లిఫ్ట్ కూడా ఇవ్వడం లేదు. మేడం మీరైనా నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి అంటూ కన్నీటితో అడుగుతున్నా కూడా లేదు గీత నేను అటు వైపు వెళ్ళడం లేదు అంటూ అబద్ధం చెప్పి ముందుకు వెళ్లి పోయాను.

వెళ్తున్నాను కానీ నామీద నాకే అసహ్యం వేసింది. ఛీ నేనేంటి ఇలా ప్రవర్తించాను కొంచమైనా మానవత్వం లేకుండా. హిజ్రా అయితే ఏంటి తను మాత్రం మనిషి కదా, అవసరం అందరికీ వస్తుంది కదా, నేనే ఇలా అబద్ధం చెప్పి సాటి మనిషికి మానవత్వం లేని దానిలా
సాయం చేయకుండా పారి పోతున్నాను. రేపు స్టూడెంట్స్ కి ఏ మొహం పెట్టుకుని నీతి వాక్యాలు చెప్పగలను. అనుకుంటూ మళ్లీనా స్కూటీని వెనక్కి పోనిచ్చి గీతకు లిఫ్ట్ ఇచ్చి తనతో నేను కూడా హాస్పిటల్ లోపలికి వెళ్ళాను. గీత నాన్నని చూడటానికి గాయాలు బాగా తగిలాయి పాపం. అప్పటికప్పుడు ముప్పై వేలు బిల్ కట్టమన్నారు. గీత నీళ్ళు నములుతూ ఉంటే నా ఏటీఎం కార్డుతో నేనే పే చేశాను. గీత ఆమె నాన్న నాకు కృతజ్ఞతలు చెబుతూ ఉంటే వారించాను. ముందు మనం మనుషులం మానవత్వానికి ప్రతీకగా బ్రతికి చూపించాలి డబ్బు దేముంది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది మిగిలేది మంచితనం ఆత్మసంతృప్తి అంతే అన్నాను నేను.

సరే గీత నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేక నేను ఇవ్వనా అని అడిగాను, అయ్యో వద్దు మేడం 10,000 ఉన్నాయి నా దగ్గర వాళ్ళు 30,000 అనేసరికి నాకు ఏం చేయాలో తోచలేదు అని చెప్పింది గీత. సరే అంటూ ఇక నేను వెళ్తానని వాళ్ళిద్దరికీ చెప్పి ఇంటికి బయల్దేరాను.

నా మనసు ఇప్పుడు ఎంతో తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది.
మా నాన్నగారు ఎప్పుడు నాతో ఒక మాట చెప్పేవారు, పూర్ణిమ జీవితం ఎప్పుడు నాటకీయంగా బ్రతకకూడదు, పరిపూర్ణంగా జీవించాలి ఎలాంటి మలినాలు మనసులో నింపుకోకూడదు అని.
నిజమే ఎక్కడో మూలన దాగి ఉన్న నా మనసులోని మలినాన్ని ఈరోజు నేను కడిగేసాను. అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది నా మనసు,అనుకుంటూ నేను మా ఇంటికి వెళ్ళిపోయాను.

***** సమాప్తం*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!