కథ మారింది

కథ మారింది!

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

కృష్ణారావు బజారు నుండి ఇంటికి వెళ్తున్నాడు.ఒక అరగంట పడుతుంది బజారు నుండి ఇంటికి.అడుగులు వేగాంగానే వేస్తున్నాడు.దారి తరగటం లేదు.మెదడు నిండా ఆలోచనలు.ఒకదానికొకటి వెంట వెంపనే వచ్చి కలవరపెడుతున్నాయి .ఏంచేయాలి ఇప్పుడు? ఏవరిని సంప్రదించాలి?ఈ కరోనా సమయంలో ఏవరు తనను ఆదుకుంటారు?అన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.వనుక నుంచెవరో పిల్లస్తున్నట్టుంది.
వెను తిరిగాడు.కాంతారావు తన చిన్ననాటి స్నేహితుడు.ఇద్దరం కలుసుకొని పాతిక సంవత్సరాలైంది.ఆలోచనలో వుండగానే
“ఏమిటోయ్ కృష్ణా అంత పరధ్యానం.రోడ్డుమీదనడుస్తున్నప్పుడు కాస్త తెలివిగా ఉండాలి కదా!సరెలే దేనిగురించో తివ్రంగా ఆలోచిస్తున్నంటున్నావు.పద అలా మా ఇంటి దగ్గర కూర్చోని వెళ్ళొచ్చు.”అంటూ కాంతారావు తన ఇంటి దగ్గరకి తీసుకొని వెళ్ళాడు.అక్కడికి వెళ్ళాకా శానిటైజర్ రాసుకొని కాళ్ళు కడుగుకొని దూరంగా ఇంటి వరండాలో కూర్చున్నారు.
“ఇప్పడు చెప్పు.నీ సంగతులు.మొన్ననె నేను మా వాడి దగ్గరకి వెళ్ళి ఒ మూడునెలలుండి వచ్చాను.అక్కడా ఈ కరోనా హడావుడే.ఎక్కడికి వెళ్ళిందిలేదు.ఇక ఉండలేక వచ్చెశాము.శుభవార్త విన్నాను.మీ అమ్మాయికి పెళ్ళట.”అంటూ బొళబొళ వాగేశాడు.
“ఏం చెప్పమంటావు ?ఇక్కడా అదే పరిస్తితి.అమ్మాయికి పెళ్ళికుదిరింది నిజమే.గాని ఏలా జరుగుతుందోనని ఆందోళనగా వుంది.ఈ పదిహెనోతారీఖున ఏవో సడలింపులుంటాయంటున్నారు.చూడాలి.అదొక ఎత్తు.ఇంకొక సమస్య నాకు ఆందోళనగా వుంది.
నీకు తెలుసుగా నా రిటైర్మెంటు డబ్బులు సగం మా అబ్బాయి చదువుకే పెట్టేశాను.మిగిలిన డబ్బు పిల్ల పెళ్ళికి సరిపోతుందనుకుంటే అందలో కొంత
మీ వదిన అనారోగ్యానికే ఖర్చు చేసేశాను.మిగిలిన డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులుగావుంది. అదీకాక ముందేమి మాకివ్వక్కర్లేదన్నవాళ్ళు తీరా
నిశ్చయతాంబూలాలు పుచ్చుకన్నాక అది చెయ్యండి ఇది చెయ్యండని ఎవేవో పేచీలు పెడుతున్నారు.మావాడు సహాయం చేస్తాడు కదాని అన్నింటికి సరేననేశాను.వాడు ఏమీ ఉలుకూలేదు పలుకూ లేదు.ఆందుకే నా బెంగ దిగులు.”తన గోడు వెళ్ళబెట్టుకున్నాడు కృష్ణారావు.
“నమస్కారం !అన్నయ్యగారు!.ఈ కాఫీ తీసుకొండి.అమ్మాయి పెళ్ళని విన్నాను”కాంతారావు భార్య సుమతి వచ్చింది కృష్ణారావు కు కాఫి కప్పు అందిస్తూ.
“అవునమ్మా!మీకు నిశ్చితాంర్ధమప్పుడు పిలుద్దామంటే ఊర్లో లేరాయే.ఆ విషయాలే కాంతి తో మాట్లడుతున్నాను.”కృష్ణారావు జవాబు.
“సంతోషం అన్నయ్యగారు.పోనిలెండి పెళ్ళి సమయానికి వచ్చేశాము కదా”సుమతి సమాధానం.
ఇంతలో కృష్ణారావు ఫోను రింగైంది.ఆది కాబోయే వియ్యంకుడి బావనుంచి.ఫోనెత్తి మాట్లాడాడు.
“హలో కృష్ణారావుగారు!క్షమించండి ఈ వార్త మీకెలా చెప్పాలో తెలియటం లేదు. మీ కాబోయే అల్లుడికి కరోనా సోకి చనిపోయాడు.ఈ విషయం తెలియజేయడానికి చింతిస్తున్నాను……
ఆ వార్త వింటూనే కృష్ణారావు స్ప్రహ తప్పి పడిపోయాడు.ఆ ఫోను అందుకొని కాంతారావు విషయం తెలిసి బాధ పడ్ఢాడు.
కృష్ణారావు ముఖంపై నీళ్శు జల్లాడు.స్ప్రహనుండి కోలుకున్న కృష్ణారావు కాంతారావుని పట్టుకొని బోరుమన్నాడు.కాంతారావు సుమతులు ఎలా ఓదార్చాలో తెలియక ఖిన్నులయ్యారు.కృష్ణారావుని తన ఇంటీ వద్ధ దిగ పెట్టడానికి కాంతారావు సుమతులు వెళ్ళారు.
ఇంటికి చేర్చిన కాంతారావుని సుమతులు కృష్ణారావు భార్య శ్రీలక్ష్మిని కూతురు సుధను ఓదార్చడం ఆరంభించారు”జరిగిందేదో జరిగిపోయింది.అతనికి కరోనా సోకీందని ముందుగానైనా చెప్పారు కాదు. అయినా ఆ దేవుడు ఒకవిధంగా మంచే చేశాడు.పెళ్ళికాకముందు జరిగింది కాబట్టి సరిపోయింది.అటు డబ్బూపోయి ఇటు పిల్ల ఇంటికి చేరేది.అది మరింత బాధాకరమే కదా.”వారిని శాంత పరిచి వచ్చేశారు.ఇదేమిటిలా జరిగిందని కృష్ణారావు దంపతులు దిగులు పడగా కూతురు సుధ మాత్రం ఏమి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఒక వారం రోజులు తరువాత కాంతారావు సుమతులు కృష్ణారావింటికి వచ్చారు.వారింకా విచారంగానే ఉండడంతో “ఏమిటి మీరింకా ఆ విషయంతోనే బాధపడుతున్నారా?ఒకందుకు మంచిదే కదా.డబ్బునష్టం జరిగివుండొచ్చు.కాని వేరే ఆలోచన చేయోచ్చుకదా.పిల్ల చదువుకుంది. ఏదైనా ఉద్యోగం చేయోచ్చు.ఈలోగా మరో సంబంధం చూసి చేయోచ్చు.అంతేగాని సర్వం పొగొట్టుకున్న వాళ్ళలా అలా బాధపడుతూ కూర్చుంటే ఏలా”.కాంతారావు సుమతులు సముదాయించారు.
“చూడు కృష్ణా !మేమిద్దరము మీకో విషయం చెప్పడానికి వచ్చాము.మీకేమి అభ్యంతరము లేకపోతే ,మీ సుధకు కూడా కలిపి మాఅబ్బాయి సతీష్ కిచ్చి పెళ్ళిచేస్తే ఎలా వుంటుందో చెప్పండి.” ఆ మాటలకి కృష్ణారావు.దంపతులు ఆశ్చర్యపోయారు.గదిలో వున్న సుధ కూడా అమ్మానాన్నలు ఏమిటి చెబుతారోనని చెవులు రిక్కించి వినసాగింది.
ఆశ్ఛర్యంలోంచి తేరుకోగానే కృష్ణారావు సంతోషంతో మాటలురాక తడబడతూ”ఓరే !కాంతీ ఎంత శుభవార్త చెప్పావురా.ఇంత వేగంగ ఇలాంటి శుభవార్త వింటానని ఆనుకోలేదు.మాకైతే అభ్యంతరంలేదు.మరి మీవాడు ఈ విషయం తెలిసి ఒప్పుకుంటాడాని”సందేహం వ్యక్తం చేశాడు కృష్ణారావు. “దానికి మీరేమి సందేహించనక్కర్లేదు.ఆ విషయం వాడితో ఆ రోజే మాట్లాడాను.వాడు కూడా సరేనంటేనే మీదగ్గరకి వచ్చాము.వెంటనే మరో ముహుర్తంచూసి పెళ్ళిచేసేద్దాం.ఎందుకైనా మంచిది
మీ సుధను కూడా అడిగి చెప్పండి.మీనుండి వచ్చిన సమాధానాన్ని బట్టి మేము మా పనులను మొదలు పెడతాము”,కాంతారావు సుమతులు వెళ్ళిపోయారు.
కృష్ణారావు శ్రీలక్ష్మిలు కూతురు సుధతో మాట్లాడారు.సుధ కూడా అంగీకరించడంతో వాళ్ళిద్దరికి పెళ్ళి నిశ్చయించారు.కధ మారిఃది కదా!
మీకిష్టమేనా?!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!