నువ్వంటే నాకిష్టం లేదు

నువ్వంటే నాకిష్టం లేదు!

రచన: బి హెచ్.వి.రమాదేవి

అందమైన సాయంత్రం,ఇంకా అందమైన చీరల గరగర లతో అమ్మాయిలు అటూఇటూ తిరుగుతున్నారు. అది పెళ్ళిల్లు! కానీ ఎవరి ముఖం లో ఉండవలసి నంత సంతోషం అస్సలు లేదు. అన్నీ యాంత్రికంగాజరుగుతున్నాయి.ఆ పెళ్లి కూడా అలాగే జరిగింది.పెళ్లి కొడుకు ముఖం లో గానీ,పెళ్లి కూతురు ముఖం లో గానీ ,అస్సలు సంతోషం లేదు.అసలు ఆ పెళ్ళే కరెక్ట్ కాదు.కొన్ని బాంధవ్యాలకు,
బంధాలకు,ముడివడింది.కొన్ని ఆత్మీయతాను రాగా లకు కట్టు బడింది. చూస్తుండగానే పెళ్లికూతురుని పూలజడతో,
తెల్లచీర,కళ్యాణ తిలకం తో అలంకరించారు.గదిలోకి అమ్మలక్కలుదిగబెడుతూ ,తెచ్చిపెట్టుకున్న సంతోషంతో
లోపలికి సుష్మ ను నెట్టి తలుపు వేశారు. మహేష్ తెల్లని పంచ లో మెరిసి పోతున్నాడు.
అందంగా వున్నా ఆమెకు రావణాసురునిలాకనబడుతున్నాడు. తేదీ యేమైనా వీడు నా భర్త కాదు.నేను వీడికి భార్యను కాను.గట్టిగా అనుకుంది సుష్మ!
పాల గ్లాసు టేబుల్ పైన ఉంచింది.అతనికి.నమస్కరించాలిఅనిచెప్పారు.ముత్తైదువలు. వీడు భర్త అయితేనే కదా!
” పాలక్కడున్నాయి.త్రాగండి.” సుష్మ మెల్లగా అంది.
“నువ్వు త్రాగవా!?” ప్రశ్నించాడు.
“త్రాగను!” గట్టిగా చెప్పా ననుకుంది.
“ఓ కే! ఒకవేళ త్రాగుతావేమో నని” గ్లాసు ఖాళీ చేశాడు.
“పడుకో! “దిండు దుప్పటి క్రింద పడేశాడు.
ఇదేమిటి! ఇవన్నీ తను కదా! చేయాలి.అతడు తనను తాకితే,తను ప్రతిఘటించాలి!
నానా తిట్లు తిట్టి,నాన్నను వలలో వేసుకుని ఈ పెళ్లి చేసుకున్నందుకు దుమ్మెత్తి పోయాలి.వదినను కావాల్సిన నన్ను, సిగ్గులేకుండా పెళ్లి. చేసుకున్నాడు.ఆమెకు ఏ డుపు వస్తోంది.
అది తను తిరస్కరించవలసినది,అతడు తిరస్కరించాడనో,లేదా అన్న లేకుండా చూసి నోరు కట్టేసి పెండ్లి చేసుకున్నా డనో తెలియదు.ఈ రోజు ఊరుకుని
తనను తరువాత లోబరుచుకుంటాడేమో! అస్సలు లొంగనే లొంగదు.అయినా వీళ్ళ అన్న వచ్చేవరకు ఎదురు చూస్తుంది.జరిగినది చెప్పి,తనను తీసుకు పొమ్మంటుంది. అంతే,!
నిరన్యించుకున్నాక హాయిగా ,నిద్ర పోయింది.

వీళ్ళ అన్న పెళ్లి కుదిరిన దగ్గర నుండి ఎన్ని వూసులు చెప్పాడు.తెలియకుండా రెస్టారెంట్,సినిమాలకి కూడా
తీసుకెళతానని చెప్పాడు. కానీ తనే సాహసం చేయ లేక పోయింది.
తన ఫ్రెండ్స్ అందరూ తిట్టారు.
ఇలాంటి ఛాన్స్ వదిలినందుకు,
కానీ తల్లి లేని పెంపకం ఇలాగే ఉంటుంది.అని నాన్నకు అప్రదిష్ట రాకుండా ఉండ డానికి
తను వెళ్ళలేదు. కానీ ఆయన ఎక్కడ!? కరోనా.వచ్చింది అంటున్నారు.మారి వస్తే నేం!?, తగ్గాక చేసుకోవచ్చు కదా! నీకేమి తెలియదని అందరూ పట్టుబట్టి కట్టారు. కోలుకున్నాక
ఎంత బాధ పడతాడో! బాధపడకుండా చేయ డానికి తను ఉందిగా!
అమ్మాయిల్లో ఓ బలహీనత ఉంది.పెళ్లికి ముందు తెగించి లేనివారు,పెళ్లయ్యాక తెగి స్తారు.సుష్మ కూడా అందుకు భిన్నం కాదు!
తెల్లవారింది.లేచింది.తను ఏమి,ఎవరికీ సాక్ష్యాలు చూపించాల్సిన పని లేదు.అప్పటికే ఫ్రెష్ గా వున్నాడు.మహేష్!
సిగ్గులేని వాడికి నవ్వొక అందం అని అమ్మమ్మ చెప్పనే చెప్పింది. భోజనాలయ్యాక,ఎవరో సురేష్ చచ్చాడు.అంటున్నారు. కానీ ఎవరూ ఏడ్వడం లేదు.ఏమిటీ కరోనా వలన,అందుకే ఈ పెళ్లి చేశారా!?.తన మనసు కీడు శంకించింది.రోగం వ స్తే చావకుండానే మరో పెళ్లి చేశా రన్నమాట. ఈ సంఘం అంటే ఆమెకు ఏవగింపు కలిగింది.
బ్రతికే వాడేమో! ఈ పెళ్లి వార్త విని బాధతోచనిపోయుంటాడు. ఒక్క సారిగా అతనిపై ప్రేమ ముంచుకొచ్చింది. అంతలో ఓ అద్భుతం జరిగింది.
సురేష్ వస్తున్నాడు. ప్రక్కన ఓ అమ్మాయి గర్భవతి,చిన్న పిల్లాడు. ఇదేమిటి! ఆమెకు ఏదో మైకం కమ్మినట్లు అయ్యింది.మహేష్ పట్టుకున్నాడు.
తీసుకెళ్ళి బెడ్ మీద పడుకో బెట్టారు.ఇష్టం లేని పెళ్లి అవడం వలన ఆమె నాల్గురోజులుగా తిండి తినలేదు.వరుసగా ఉపచర్యలు మహేష్ చేస్తున్నాడు.మామయ్య ఇప్పుడేమి సుష్మాకు చెప్పకండి.చాలా వీక్ గా ఉంది.
ధర్మా మీటర్ చూస్తూ చెప్పాడు

***

మరునాడు ఉదయం తండ్రి చెప్పాడు.తమ శుభలేఖ అందిన మరుక్షణం అతడు లోగడ దొంగ పెళ్లి చేసుకున్న అమ్మాయి కి ఒక బాబు వున్నాడని,ఇప్పుడు మరలా గర్భవతి అనీ,తనకు గుండె నొప్పి వ స్తే ,.మహేష్ సేవలు చేసి రచించాడని,తన అన్న ద్రోహానికి తాను తాళి కట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని, అందులో ,నీకు నచ్చేదాక వేచి యుంటానని మాట ఇచ్చాడు.తండ్రి పోలీస్ స్టేషన్ కెళ్ళే అవసరం తప్పించిన మహేష్ నీ మరోసారి కృతజ్ఞత గా చూసింది. ఇపుడు అతడు రావణుని లా కనబడటం లేదు.
రాముని లా కనబడు తున్నాడు. ఆనాటి రాత్రి పాలు త్రాగుతున్న పుడు నేను పాలు పంచు కోవాలనుకుంటున్నాను.ఉంచండి.అవునా! భూజాలెగరేశా డు.అంతేకాదు.పరుపుకూడా! ప్రక్క కొచ్చి చెవిలో అన్న ది.అమ్మాయిలు ఇలాంటివి మాట్లాడితే చాలా బాగోదు.పెదవులతో మూస్తూ అన్నాడు.నాటకీయంగా మహేష్! ఇంకా ఏముంది! ప్రేమవిందు,పొందు,పసందు, మొదలయ్యింది..చంద్రుడు సిగ్గుపడి మబ్బు చాటుకు తప్పుకున్నాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!