ఆశల నిచ్చెన

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

ఆశల నిచ్చెన

రచయిత :: ఉదయగిరి దస్తగిరి

udayagiri dhastagiri

ఆశలకి,అవసరాలకి నడుమ
ఆకలికి,ఆధాయానికి మధ్యన
శృతిమించిన కోరికలతో
ఆశల నిచ్చెన ఎక్కి
నిరాశ పాములచేత చిక్కి
భంగపడేవెందుకు

బతుకును బలిచేసే పేరాశను ప్రేమిస్తావు
లేనిదానికై అతిగా ఆరాటపడతావు
ఉన్నదానితో తృప్తిపడవు
అందని ఆకాశానికి ఆశల నిచ్చెన వేసి
అదఃపాతాళానికి జారిపడేవెందుకు

వెలుగును కాల్చే నిశి వెంట నడుస్తూ
ఎడారివంటి ఆశల వెనుక పరిగేడుతూ
ఆశల భూతానికి బానిసవై
కోరికల కాంతకి దాసుడవై
తృప్తి లేని జీవితాన్ని గడుపుతున్నావెందుకు

అందని వాటికి అరులు చాచకోయ్
ఆశలకు అంతులేదని తెలుసుకోవోయ్
పతనం చేసే అత్యాశని వదిలి చూడవోయ్
ప్రతిదినం ఆనందమేనోయ్
ప్రతి నిద్రలో సుఖమున్నదోయ్…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!