నేను ఆశావాదిని

నేను ఆశావాదిని 

రచన::మీసాల చినగౌరినాయుడు బొబ్బిలి

ముందెలాగున్నావో తెలుసు
ఇప్పుడెలాఉన్నావో తెలుసు
రేపు ఎలా ఉంటావో తెలుసు
ఎందుకంటే
నేను జ్యోతిష్కుడిని కాను
కానీ
నీ ఊహల పల్లకీని మోసే బోయీని….

గతం గురించి తెలుసు
వర్తమానం గురించి తెలుసు
భవిష్యత్ గురించీ తెలుసు
ఎందుకంటే
నేను విధాతను కాను
కానీ
నీ ఆశల సౌధానికి
నిర్మాతని….

నీ నడకేంటో తెలుసు
నీ నడతేంటో తెలుసు
నీ భవితేంటో తెలుసు
ఎందుకంటే
నేను సిద్ధాంతిని కాను
కానీ
నీ బతుకు రథానికి
చక్రాన్ని……

నీ మాట నాకు తెలుసు
నీ బాట నాకు తెలుసు
నీ గమ్యం నాకు తెలుసు
ఎందుకంటే
నేను మాంత్రికుడిని కాను
కానీ నమ్మకాల వెంటపడే
యాంత్రికుడిని…

అన్నిటికీ మించి
నేనొక సగటు తండ్రిని…

అందుకే నేను ఆశావాదిని…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!