ఓ… మిత్రమా!

(అంశం :: “విమర్శించుట తగునా”)

ఓ… మిత్రమా!

రచన::అశ్విని “సంకేత్”

నీది,నాది అనెదవు…
నీది కానీ దానికి ఆశ పడకూడదని తెలియదా!!

నా ఇష్టం నాది అనెదవు…
ఎవరి ఇష్టం వారిది అని తెలియదా!!

నాది గొప్ప అని వాదులాడేదవు…
ఎవరిది వారికి గొప్ప అని తెలియదా!!

వారు చేసేది మంచి కాదు అనెదవు…
ఏది మంచో అది నీవు చేయక ఎదుటి వారిని విమర్శించుట తగునా!!

దైవం లేదని అన్నది నీవు…
కష్ట కాలంలో ఆ దైవాన్ని తలచేది నేవే!!

పరుల సొమ్ము పాము వంటిది అనేది నీవు…
ఆ పాము పుట్టలో చెయ్యి పెట్టేది కూడా నీవే!!

ఈ జగన్నాటక సూత్రంలో ఆడేది మనం,ఓడేది మనమే అని తెలియక…
నీది ఓటమి,నాది గెలుపు అని విమర్శలెందుకు మిత్రమా!!

ఉన్న ఈ గోరంత జీవితానికి,రంగులు పూయడం ఆపి…
రంగవల్లిలాంటి జీవితాన్ని హాయిగా అనుభవించు మిత్రమా!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!