పద్య పరిమళాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారుమంచి వాణి ప్రభాకరి
1 సూర్యుడు
కాంతి రేఖ లన్ని ఇంతిలా వెలిగెను
పూల బాట గా వినీల మెలగ
వ్యక్తి వ్యక్తి లోన భాసిల్లు కాంతి గా
జగము రాజ్య మేలు సంఘ మందు
2) బ్రహ్మ
బ్రహ్మ నాల్క నిత్య పద్మ పీఠము కాగ
వీణ కరము బట్టి వెలుగు చుండె
వరములిమ్ము తల్లి! పలుకులమ్మా! దేవి!
జగము నేలు మమ్మ! సంఘమేసి!
3) శ్రీ లక్ష్మి
వక్ష స్థలము నందు వాసిగ వెలసివి
సర్వ నేత్ర! రమణి! శాంతి రూప!
నీ కరుణను పొంద నే వేచి యుంటిని
నీర జాక్షి! యనిన నిన్ను మ్రోక్కె!!
4) వినయము
వినయ ముగను చేరి విద్యను పొందిన
సకల జనులకెల్ల సాయమందు
తల్లి తండ్రి గురువు కాళ్ళను మ్రోక్కియు
సేవ చేయు వాడు సిద్దుడగును!!
నిలలోన మీర!!