సృష్టి!

అంశము: మన్మధ బాణం!

సృష్టి!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

మన్మధుడు లేకపోతే ఆకర్షణ లేదు,
మన్మధబాణం లేకపోతే సృష్టి లేదు,
ముక్కంటిపైనే బాణాలు
సంధించిన ఘనుడు మన్మధుడు,
ఇక సామాన్యులెంత!
కానీ, మన్మధ బాణాలను
అదుపులో పెట్టి యుక్తాయుక్త విచక్షణతో మసలకపోతే, సజ్జనులు ఉరుకోరు!
సభ్యసమాజం హర్షించదు
మన్మధుడికి పట్టిన దుర్గతే పడుతుంది!
అందుకే హాయిగా పెళ్ళి చేసుకో
భార్య అనుకూలవతి అయితే
హాయిగా సుఖపడతావు
లేకపోతే వేదాంతివి అవుతావు అంటారు
ఓ మన్మధా ఇంకారాస్తే
ఇంకేం వస్తుందో ఇక్కడితో
నీ లీలలు ఆపు స్వామీ!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!