పూబాణం 

అంశం: మన్మథ బాణం

పూబాణం 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

పూబాణమది
ఊహా బాణమది
కాముడు విడుచునది
రజోగుణాన్ని తట్టిలేపునది
సృష్టికార్యాన్ని ప్రేరేపించునది
స్తబ్దతను ఉత్సాహంగా మార్చునది
నిద్రాణాన్ని అలసటనిద్రగా చేయగలిగేది
పులకింపజేయు పరిమళాన్ని వెదజల్లునది!
పుష్పాలను ఫలదీకరణం చెందించేదానిలా
మోడువోయిన వృక్షాన్ని చిగురింపజేసేలా
బీటలువారిన నేలకి పదునందించేలా
మండుటెండలో చల్లని చిరుజల్లులా
వణికించే చలిలో వెచ్చదనంలా
ఒప్పునది సేదతీర్చే చెలమలా
మానవజాతి వృద్ధికి వరంలా
మదిలో కోర్కెలు రేపేలా!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!