వాస్తు-వాస్తవం ఎంత?

వాస్తు-వాస్తవం ఎంత?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: కార్తీక్ దుబ్బాక

రామనాధం ఇల్లు కట్టుకోవాలి అని ఊర్లో మంచి సెంటర్ చూసి ఒక 4సెంట్ల స్థలం కొన్నాడు. స్థలం కొనేటప్పుడు తన పేరు మీద స్థలం కొనాలి, అని ఒక పేరున్న జోతిష్యుడిని కలిసాడు. అతడు కొంత అమౌంట్ తీసుకొని తనకు తెలిసిన జ్ఞానం తో దిక్కుమాలిన దిక్కులు మూలలు అలా ఉంటే తీసుకోమని సలహా ఇచ్చాడు.  కొంతకాలం జరిగింది తరువాత ఇల్లు కట్టాలి అనుకుని రామనాధం వాస్తు చూసే అతన్ని పిలిచు కొని, ఈ స్థలం లో ఇల్లు కట్టాలి, అని ఏమూల ఎలా ఉండాలి అని అడిగాడు. ఆ స్థలం లో ఆ దిక్కు, ఈ మూల అది ఉండాలి, ఈ మూల ఇది ఉంటే బాగుంటుంది, ఇది ఇక్కడ ఉండాలి అని చెప్పి అతను ఫీజు అతను తీసుకున్నాడు వాస్తు సిద్ధాంతి. ఇక రామనాధం ఇల్లు కట్టాలి అని నిర్ణయం తీసుకొని ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు. ఎవరో ముఖ పరిచెయస్తుడు నిర్మాణం జరుగుతున్న ఇంటిని చూసాడు దారిన పోతూ, రామనాధంని పిలిచి ఈ ప్లేసులో ఎదో దోషం ఉంది ఇంత కాలం ఎవరు కొనలేదు, సరైన దోష నివారణ చర్యలు తీసుకున్నావా అని అడిగి, దోష నివారణ కు ఒక మంచి బ్రాహ్మనుడు ఉన్నాడు, అతను ఏ దోషం ను లేకుండా చేస్తాడు అని చెప్పాడు. రామనాధంకి బెంగ పట్టుకుంది, ఏంటి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని నేను స్థలం కొన్నాను, ఇంటి నిర్మాణం వాస్తు చూపించి కట్టిస్తున్న అని మధన పడుతున్నాడు. సరే, ఇంత చేశాను దోష నివారణకు కూడా యజ్ఞం చేపిస్తా అని ఆ వ్యవహారం కాస్త కానిచ్చాడు. అన్నీ ఆలోచనలు, అందరు సలహాలు తీసుకుంటూ ఇంటి నిర్మాణం చేస్తున్నాడు. ఈ ఆలోచనలుతో మధన పడుతు రోగాలు తెచ్చుకున్నాడు. డబ్బులు సిద్ధాంతులకి ఎక్కువ పోవడం, రోగాలతో ఆసుపత్రి పాలు  అవడం వలన ఇంటి కోసం దాచిన డబ్బులు అయిపోయాయి. ఇల్లు పూర్తి అవకుండా మధ్యలో ఆగిపోయింది. రామనాధం, అవి అన్నీ తలుసుకుంటూ మంచానా పడ్డాడు. కుటుంబం సభ్యులు అందరు ఎన్ని చెప్పిన తన ఆలోచనల నుండి బయటకు రాకుండా బాధ పడుతున్నాడు.
రామనాధం పరిస్థితి తెలుసు కున్న కొందరు అయన దగ్గరకి చూడటానికి రావడం, వారికీ తెలిసిన సలహాలు ఇవ్వడం, వెళ్లడం చేస్తున్నారు. చివరగా ఒక కొండదొర దారిన పోతు రామనాధం ఇంటికి వచ్చి, ఈ స్థలం లో ఇల్లు కట్ట కూడదు వాస్తు బాగా లేదు. ఈశాన్యంలో స్మశానం ఉంది, ఆగ్నేయ బాగాలేదు, వాయువ్యం మూసి ఉంది దీని లో ఇల్లు కడితే మరణం లో సంభావిస్తాయి, అనారోగ్యం  పాలవుతారు, అని చెప్పాడు. అన్నీ జాగ్రత్తలు తీసుకొని, సిద్ధాంతులు చెప్పిన విధంగా చేసి, అనుమానంతో జబ్బున పడి కొండ దొర చెప్పిన మాట కూడా నమ్మి ఆ స్థలంను సుబ్బారావు అనే వ్యక్తికి నష్టంగ అమ్మాడు. సుబ్బారావు ఆ స్థలం లో ఇల్లు కట్టుకొని హాయిగా ఉంటున్నాడు. ఒక రోజు రామనాధం సుబ్బారావుని అడిగాడు. వాస్తు గురించి, అప్పుడు సుబ్బారావు భూమి గుండ్రంగా ఉండి ప్రతి రోజు తిరుగుతుది. ఒక చోట ఎప్పుడు ఆగదు. ఈ రోజు నువ్వు ఉన్న చోట మరల నువ్వు తిరిగి రావాలంటే 24గంటలు పడుతుంది.
ఈశాన్యంమూల, తూర్పు దర్వాజ అన్నీ ఒక సెకనులో ఉంటాయి తరువాత కదిలి పోతాయి. గుండ్రంగా ఉన్న గోళానికి దిక్కులు, మూలలు ఎక్కడ కనబడతాయి. అన్నాడు సుబ్బారావు.
వాస్తు ఎక్కడ, అదంత మూఢ నమ్మకం. అన్నీ నమ్మి నీ ప్రాణం మీదకు తెచ్చుకున్నావు. అని చెప్పి, రామనాధంకి హిత బోధ  చెప్పాడు. రామనాధంకి వాస్తు పై, భూగోళంపై అవగాహన కలిగి, వాస్తు పరంగా ఒరిగేది ఏమి ఉండదు అని, ఒక నిర్ణయానికి వచ్చాడు.అది ఒక ఆర్ధిక దోపిడి, తెలుసు కున్నాడు.తనలాంటి అమాయకులు ఎంత మంది వాస్తును నమ్మి ఆర్ధికంగా నష్ట పోతున్నారో అనుకుంటూ అక్కడ నుండి వెళ్లి పోయాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!