అందాల బాల ఆనంద హేల
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: నారు మంచి వాణి ప్రభాకరి
ఓ బాల నీ చిరునవ్వు
నాకు పన్నిటీ ఝల్లు
నీ పలుకులు నాకు
పంచదార చిలకలు
నీ చూపులు అద్భుత కాంతులు వెదజల్లే
నక్షత్రాల వెలుగులు
ఆనంద భావాలు స్ఫూర్తి
అందాల ఆనంద హెలా
నీ కదలికలో అద్భుత నాట్య
విన్యాసాల ప్రతి రూపాలు
నీ పిలుపు కోసం సదా వేచే
అందాల బాల ఆనంద హేల