జీవితం విలువ లేనిదా?

జీవితం విలువ లేనిదా?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

సెల్లు ఫోను కొనలేదా! నిరాశ
వీడియో గేము వద్దన్నా నిరాశ!
ఒకరికి మార్కులు తగ్గితే నిరాశ
ఒకరికి పరీక్ష తప్పితే నిరాశ
ప్రేమ దక్కలేదని, అమ్మ తిట్టిందనీ
నిరాశ లో ప్రాణాలు తీస్తారు
లేదా మృత్యువునే ముద్దాడతారు
నీ జీవితం విలువ శూన్యమా?
అదేనా అంతిమ సమాధానం?
నిరాశలో ఒక్క క్షణం నిరీక్షిస్తే
సువిశాల ప్రపంచంలో
నీకో చిన్న చోటు దొరకదా?
కోటాను కోట్ల జనాలలో
ఊరట నిచ్చే మనిషి లేడా?
బ్రతకటానికి దారులు వెతుకు
రెక్కలు రాగానే పిల్లని
గూటి బయటకు తరిమితే
ప్రయత్నించి ఎగిరే
చిన్న పిట్ట పాటి ప్రయత్నం
చేయక, పోతానంటావా?
ఏమీ సాధించక ఏమిటది?
విచక్షణ వదిలి ఎందుకలా?
ప్రాణాలకు తెగించి కన్న అమ్మను
ప్రాణ ప్రదమైన ఆత్మీయులను
కన్నీటి సంద్రాన తోసి పోకు!

You May Also Like

10 thoughts on “జీవితం విలువ లేనిదా?

  1. ప్రస్తుత సమాజానికి అద్దం పడుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!