లక్ష్య సాధన

లక్ష్య సాధన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

రెక్కలు ముక్కలు చేసుకొని
రక్తాన్ని స్వేదం గా చేసి
బతుకు బండిని లాగిస్తు
ఉన్నదానితో జీవితాన్ని కొనసాగిస్తున్నకష్టజీవికి తన శ్రమ శక్తే ఊపిరి పాట
ఎండనక వానానక
దుక్కుదున్ని నారు పోస్తూ నీరుపోస్తు
ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా
లాభ నష్టాలతో సంబంధం లేకుండా
కాలానుగుణంగా పంటలు పండించి అందులో ఆనందాన్ని ఆస్వాదించడం
అన్నదాతకు ఊపిరిపాట
ఎక్కడికో బతుకు తెరువుకి పోయి
పిల్లా పాపలను వదిలి
రోజు కూలీ చేసుకొని రొట్టి ముక్కతో
కడుపు నింపుకొని
సంసారాన్ని ఆనందం గా గడుపుతున్న కూలన్నకు
అతని భార్యా పిల్లల ఆనందమే ఊపిరి పాట
కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నా బిడ్డలకు ఉన్నత చదువులు చదివించాలని
పిల్లలని గొప్పగా చూడాలని కృషితో పనిచేస్తున్న తల్లిదండ్రుల కష్టపడటంలో పొందిన ఆనందమే ఊపిరి పాట
అనుకున్నది సాధించడానికి
లక్ష్యంతో లక్ష్య సాధనతో
ముందడుగు వేసి ఆనందం పొందుతున్న కృషివలుల కృషియే ఊపిరి పాట

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!