విద్యార్థులు

విద్యార్థులు

రచయిత :: సుజాత . కోకిల

అప్పుడే హడహుడిగ వచ్చిన రవితేజ ను అడిగింది
ఎంటి నాన్న అప్పుడే వచ్చావు ఎందుకు కాలేజీ లేదా ఎంటి ఈ రోజు అంత తొందరగా వచ్చావు ఎందుకు అంటు అడిగింది తల్లి కల్పన. ఏం లేదు మమ్మి క్లాసులు జరుగడం లేదు అన్నాడు రవితేజ ఆన్నువల్ ఫక్షన్ ఉంది ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు ఇష్టంలేని వాళ్ళు ఇంటికి వెళ్లోచ్చు అందుకే నాకు ఉండాలని లేదు అందుకనే వచ్చేసాను మమ్మి అన్నాడు రవితేజ. కాని మొహం చూస్తుంటే అలా అనిపించడం లేదు.

ఏదో కంగారు చిరాకు కనిపిస్తుంది అనుమానం.లేదు ఎదో జరిగి ఉంటుంది ఆందోళనగా ఉన్నాడు ఎంటి నాన్న అలా ఉన్నావు నాతో చెప్పు నాన్న ఎంటి అంత కంగారుగా ఉన్నావు, ఎంటి విషయం ఎవరి తోనైన గొడవ పడ్డావా చెప్పు నేను ఏమి అనను చెప్పు నాన్న అదేమ్ లేదు మమ్మి. నీ వాలకం అలా లేదు నాన్న ఎమి జరిగిందో చెప్పు అంది అమ్మ.

ఎన్ని సార్లు అడిగిన అసలు విషయం చెప్పడంలేదు
నన్ను ఏమి అడక్కు మమ్మి అంటూ గబగబా పైకి వెళ్ళాడు ఎమి చెయాలో అర్థం కావడంలేదు అంతలో ప్రీతి వచ్చింది ఎంటి నువ్వు కూడ వచ్చావు కాలేజీ లేద అన్నయ్యను అడిగితే నన్ను ఏమి అడక్కు అన్నాడు. అన్నయ్య అలా ఎందుకు ఉన్నాడు. అసలు గొడవ ఏంటి, నీకైన తెలుసా అంటు ప్రీతిని అడిగింది తల్లి. ఇప్పుడు అడిగి ఏం లాభం మమ్మి నీకు ముందే చెప్పాను నువ్వు వింటేనా ఒకే క్లాసుపిల్లలు కద అలా ఉంటే తప్పు ఎంటి ఈ రోజులలో కామనే అన్నావు. అలా తప్పుగాఉహించవద్దు అన్నావు. ఇప్పుడు ఏమైయింది నా కొడుకు బంగారం అని మురిసి పోయావు.

వాళ్ళు కూడ అదే అన్నారు కదే నేను కూడ అంత కచ్చితంగా ఎలా అనగలను నాకు మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పు. అదే మమ్మి నువ్వు ఈజీగా తీసుకున్నావు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు నిజంగా ప్రేమించుకున్నారు అది అందరికి తెలిసింది కాలేజీ అంతా కోడై కూస్తుంది. అది కాస్తా వాళ్ళ పేరెంట్స్ కు తెలిసింది.అయితే నేను ఏం చెసానే. అంటే మీరు తప్పులు చెస్తారు మల్లి మాపై రుద్దుతారు. ఇది ఎక్కడి న్యాయమే. మీకు ఉండాలి జ్ఞానం తల్లిదండ్రులు కాలేజీ కి ఎందుకు పంపిస్తున్నారనే బుద్ది మీకు ఉండాలి. తప్పు చేస్తే అమ్మనాన్నలు ఎంత బాధపడుతారు అనే ఆ మాత్రం జ్ఞానం లేకుంటే ఎలా, ఎప్పుడు మాపై ఏడుస్తారు ఎందుకే మీ తప్పులు మీరు తెలుసుకోరు.

మేము ఇంకేం చెయాలి ప్రేమించుకోండి అని చెపుతున్నామ వానికి రోజు చెపుతున్న జాగ్రత్తలు. ఒక పద్దతిలో ఉండాలి, హద్దులు మీరద్దు అని ఇంక ఎలా మన కుటుంబ విలువలు మన సాంప్రదాయం ఆన్ని మీరు తెలుసుకోవాలి. ఇంక ఎప్పుడు తెలుసుకుంటారు, నేను మీ నాన్న దగ్గర లేకున్న నా బాధ్యత నేను నడుచుకున్నాను. అది నేను చెసిన తప్పా… అది కాదే మమ్మి నేను కూడ చెప్పేది. అర్థం చెసుకో మమ్మి , అది పేరెంట్స్ కు భయపడి నేను ప్రేమించలేదు అంది అన్నయ్యను అక్కడ బకరాని చేసింది.

ఇప్పుడు మాకాలేజీలో అందరికి తెలుసు మా సార్లకు కూడ తెలుసు ఇద్దరు ప్రేమించుకున్నారని. ఇప్పుడు అన్నయ్య అదే బాధగా ఫీల్ అవుతున్నాడు. ప్రిన్సిపాల్ చాల మంచి వాడు, అన్నయ్య సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడని తెలుసు అందుకే అన్నయ్యను పిలిచి ఆ అమ్మాయిని ఎలా ప్రేమించావురా నీ టైమ్ అంత వేస్ట్ చెసావు కదరా, అదే చదువు మీద కాన్సుట్రేషన్ చూపిస్తే బాగుండేది. ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా మోసం చెసింది చూసావ. నీకు ఎన్ని సార్లు చెప్పాను వద్దు అంటే విన్నావ , అంటూ మందలించారు.వాళ్ళు గొడవ గొడవ చెసారు. నేను చూసుకుంటాను. నీవు ఏం మాట్లడకు అన్నారు. అందరు అన్నయ్య సైడె ఉన్నారు అమ్మాయిది కూడ చాల తప్పు ఉంది అన్నారు.అందుకే మనకు కూడ మంచే జరిగింది అనుకోవాలి.

అలాంటి పిల్ల కోసమా వీడు బాధ పడేది. మా సారు నాకు ఇదంతా చెప్పారు. నాకు తల తీసినట్లు అయింది మమ్మి. నీకు ఫోన్ చేస్తానని అన్నారు. ఇంక ఇది కూడా చెప్పారు, మమ్మిని దైర్యంగా ఉండమను నేను చుసుకుంటాను మా కాలేజీలో ఎవరికి చెడ్డపేరు రావద్దని ఆ అమ్మాయికి కూడ దైర్యం లేదు, ఇంక ఆ
అమ్మాయి వద్దు అని వాళ్ళకి నేను ఏదో చెపుతాను నీవు ఏమీ మాట్లడకు అని అన్నారు. ఆ అమ్మాయిని ఒదిలించుకో అన్నారు.నీవు ఆ అమ్మాయిని రేపు చేసుకున్న కష్టమే అవుతుంది అన్నారు.

బాబుతో నేను, మాపాప వెళ్ళాము. ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నారు అంటే ప్రిన్సిపాల్ రూమ్లో ఉన్నారు అని చెప్పారు. సార్ నన్ను చూడగానే కుర్చోండి అన్నారు. నమస్కారమండి అన్నాను, చేతులు జోడించి నవ్వుతూ… ఫర్వాలేదు అన్నారు. చెప్పండి సార్ ఎందుకో రమ్మాన్నారని చెప్పారు మా పిల్లలు. మీకు తెలుసు కద,
తెలుసు అంటే ఎమి అర్థం కాలేదు, మల్లి మీరు చెప్పండి వింటాను. జరిగిన విషయం అంతా వివరంగా చెప్పారు.

మీరు చెప్పారు నేను విన్నాను. నేను కూడ కొద్దిగా చెపుతాను దయచేసి వినండి ఆ తరువాత మీరు ఎలా చెపితే అలా వింటాను ఎందు కంటే మాకు కూడ కొద్దిగా బాధ ఉంటుంది ఇద్దరికి ఇష్టం ఉంటేనే కదండి ఏదైన జరిగేది, ఇష్టం లేకుండా ఎవరు ముందుకు రారు. అది అలా కానప్పుడు. ముందే పేరెంట్స్ కు చెప్పాలి. నాకు ఇలా పరిస్థితి ఉందని చెప్పలేదు, అంటే తనకు కూడ ఇష్టం ఉన్నట్టే కద. అది విడిచి పేట్టి మా పిల్లవాడిమీద అభాండం వేసి నేను ప్రేమించలేదు అంటే, ఎలా అది నీ ఇష్టంగా తిరిగావు ఇప్పుడు పేరెంట్స్ ఏదో అన్నారని మా పిల్లవాడిపై గొడవ చేస్తే ఎలాగండి.

బలవంతంగా తీసువెలితే తప్పు అమ్మాయికి ఇష్టమేనని తెలుస్తుంది కద. మగపిల్లలది ఉందితప్పు, ఆడపిల్లలది ఉంది తప్పు ఆ అమ్మాయి స్ట్రాంగ్ గా ఉంటే మనవైపు కన్నేత్తి చూడాలంటే గజగజ వనకాలి. మనకు ఇష్టం లేకుండా ఎవరండి వచ్చేది నాతోనైన చెప్పాలి కద నాకు పరిచయమే కద. నేను ఎన్నో
సార్లు చెప్పాను, ఇన్డైరేక్టుగా చెప్పాను మంచిగా
చదువుకోవాలి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని చెప్పాను. పెద్దపిల్లలకి ఇంతకంటే ఎక్కువ ఏం చెపుతారు. ఇష్టమైయితే ముందుకు దైర్యంగా రావాలి సమస్యను పెద్దల సమక్షంలో పరిస్కరించుకోవాలి. ఆడపిల్లకు ఎంత బాధ ఉంటుందో పిల్లావాడికి కూడ అంతే బాధ ఉంటుంది. ఈరోజులలో చాల చట్టాలు
వచ్చాయి ఎవర్ని ఎవరు మోసం చేయోద్దు. నష్టపోయేది రెండు కుటుంబాలు
అది ఆలోచించుకోని ముందుకు అడుగు వేయండి. బాధ అనేది రెండు కుటుంబాలకు ఉంటాయి. స్వచ్చమైన ప్రేమ అనుకుంటే మీరు మంచి స్థితిలో స్థిరపడ్డాక, తరువాత రెండు కుంబాల సమక్షంలో ముందుకు రండి. ఇది నా మేసెజ్ అనుకోండి సార్ మా పిల్లవాడు మాట విన్నాడు సరిపోయింది. లేకుంటే…
పరిస్థితి వేరే లాగుంటే ఆలోచిండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!