అరవిచ్చిన జాబిలి

అరవిచ్చిన జాబిలి

రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి

నిప్పుల కుంపటి
ఒంట్లో నింపుకొని
ఎగసే కన్నె ఉప్పెన
వలపులలో దాచుకొని
ప్రేమ దాహం
పెదవులపై పులుముకొని
మత్తుల ధూపం
ఎత్తలపై ఎగరేస్తూ
కత్తుల కవ్వింతలు
కౌగిలిలో జారుస్తూ
చిత్తడి చేసే
వయ్యారాల రాట్నంలో
ఊపేస్తూ….
కన్నె సొత్తును
కబలించే … విక్రముడికై
జాతర జరిపే
జాజిమల్లిక లా
ఉన్నావు…
సుగంధ మధువును త్రాగిస్తూ
అరవిచ్చిన అందాల జాబిలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!