మార్పు

మార్పు

రచయిత :: ధనలక్ష్మి

సీన్   1 :

రేయ్ వెనుక నుంచి ఇంత అందంగా ఉంది  ముందు నుంచి చూస్తే  ఎలా ఉంటుందో  బైక్ స్పీడ్ గ పెంచు రా ….ఈ రోజు ఈ అమ్మాయీ ని ఏదో ఒకటే చేయాలి ,.,… ఇద్దరు అబ్బాయల మధ్య డిస్కషన్

సీన్    2 :

ఎప్పుడు  చూడు వర్క్ చేస్తుంటాడు …ఫన్నీగ అసలు ఉండడు…ఎప్పుడు చూడు మనల్ని వర్క్ చేయమని పోరు పెడుతుంటాడు వాళ్ళ టీం లీడర్ గురించి డిస్కషన్ చేసారు మిగతా  టీం మెంబెర్స్

సీన్    3 :

ఎప్పుడు చూడు ఆలా షార్ట్ వేసుకొని వెళ్ళ్తుంది …స్విమ్మింగ్ కోసం అంటుంది ..ఆడపిల్లలకి ఇది అవసరమా ..ఆలాంటి డ్రెస్ చూస్తే నీ కదా అబ్భాయిలు రెచ్చిపోయేది…ఒక కాలనీ లో ఆడవాళ్ళ మద్య డిస్కషన్ …

సీన్    4  :

ఏంటి వాళ్ళ ఇద్దరికి ఏమైనా ప్రోబ్లేమా ఏంటి …ఎవరో బిడ్డ ని తెచ్చుకొని మరి పెంచుకుంటున్నారు …అపార్టుమెంట్లో ఇరుగు  పొరుగు  వారి మాటలు …

సీన్   5  :

అబ్బా ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి మనుషులు …ఒక స్టైల్ లేదు …కలర్ లేదు …తమ తోటి పాసెంజర్ ని చూసి మాట్లాడుకుంటున్నారు మరో ఇద్దరు పాసెంజర్స్..

సీన్    6  :

ఒక సాయంత్రం వేళ టీవీ లో సాంగ్ ను చూస్తున్నారు. హీరోయిన్ చూడు ఎలాంటి బట్టలు వేసుకొందో ,,ఈ సైడ్ క్యారెక్టర్ చూడు ఎంత నల్లగా ఉందొ ఆలా చూస్తూ వేరే ఛానల్ పెట్టాడు …ఏదో మూవీ ప్లే అవుతూంటే  ఆ కమెడియన్ చూడు ఎంత బండగా  ఉందొ తాను ఆ డ్రెస్ వేసుకోవాలా అని కామెంట్ చేస్తున్నాడు ఓ ఇంట్లో తండ్రి కొడుకులు ..అది అంత తల్లీ వింటూ ఉంది …తండ్రి కూడా నవ్వి వాళ్లకు అంతే  అని అంటున్నాడు …తరువాత కొడుకు కూడా న్యూస్ ఛానల్ పెట్టాడు అపుడు హత్రాస్ లో జరిగిన రేప్ టెలికాస్ట్ చేస్తున్నారు వెంటనే తండ్రి కొడుకులు ఇద్దరు ఫోన్ తీసుకొని ఫేసుబుక్లో,ట్విట్టర్లో ,వాట్సాప్లో ఇలా అన్ని సామిజిక మాద్యమాలొ పెట్టిసి అమ్మ మేము ఎంత గొప్ప పని చేశామో తెలుసా …వాళ్లకు శిక్షా పడాలి అని స్టేటస్ లో పెట్టాను తెలుసా అంటాడు…అమ్మ వాళ్లకు స్నాక్ ఇచ్చింది…

ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాము ….ఇప్పుడూ ఒక్కో సీన్ గురించి అసలు ఆ దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాము …

సీన్ 1   :

ఆ ఇద్దరు అబ్బాయిలు  ముందుకు వెళ్లి చూసారు అక్కడ ఉన్న అమ్మాయీ నీ షాక్ అయ్యాడు ఆ అబ్బాయిల్లో ఒకరు  ఎందుకుంటే తను అతని ఒకరి చెల్లీ….రేయ్ మామ నువ్వు అన్నట్టు బలే ఉంది కదా అన్నాడు ఇంకో అబ్బాయీ …రేయ్ తాను నా చెల్లీ రా …తనని నేను కామెంట్ చేసాను. మనం కామంతో కళ్ళు ముసుకు పోయి బిహేవ్ చేస్తున్నాము …అక్కడ కూడా ఉంది ఇంకొకరి చెల్లీ కదా రా ..అని వాళ్ళు ఇద్దరు బాధ పడతారు…

సీన్  2  :

ఆ టీం మెంబెర్స్ చేసిన మిస్టేక్ వల్ల కోడ్ ఎర్రర్ వచ్చి వాళ్లకి రావలసిన ప్రాజెక్ట్ కాన్సల్ అయ్యేలా ఉంటుంది ..ఆ కంపెనీ ఎండీ వాళ్లను జాబ్ నుంచి తీసివేయాలని చూస్తారు …వాళ్ళు చాలా కంగారు పడతారు ఇప్పుడున్న సిట్యుయేషన్ లో జాబ్ పోతే ఎలా అని …వాళ్ళ టీం లీడర్ వచ్చి ఎండీ నీ ఒప్పించి ..వాళ్లను చేసిన మిస్టేక్ తన మీద వేసుకొని …నైట్ అంత మేలుకొని మరి కోడ్ ని కరెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ వాళ్లకు వచ్చేలా చేస్తాడు ..వాళ్లంతా వాళ్ళ టీం లీడర్ ని తప్పుగా అనుకున్నందుకు బాధ పడి సారీ చెపుతారు …ఆ టీం లీడర్  “నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం …నా పని చేసుకుంటూ వెళ్లడం ఇష్టం . పైగా మీ అందరి చేసే కోడ్ నీ చూసుకోవాలిగా అందుకు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలిగా అందుకు మీ తో పాటు సరదాగా ఉండడం కుదరదు…మనతో పని ఉంటె మనం ఎప్పటికి ఒంటరిగ ఎప్పుడు ఫీల్ అవ్వము   ” మరి మీకు రిలాక్సేషన్ ఎలా సర్ ..ఏమి ఉంది మనోహరం లో స్టోరీస్ చదువుతాను ,రాస్తాను అపుడప్పుడు మనోహరం వాళ్ళు పెట్టే పోటీలలో  కూడా పాల్గొంటాను.. బహుమతి కోసం కాదు నేర్చుకోవడం కోసం…

సీన్  3  :

ఆ కాలనీ లో వాళ్లంతా సరదాగా ట్రిప్ కి వెళ్తారు…పిల్లలు ఆడుకుంటూ పొరపాటున ఒక చెరువులో పడిపోతే …ఆ అమ్మాయీ తన ప్రాణాలను పణంగా పెట్టి మరి కాపాడుతుంది ..తనని అన్న ఆడవాళ్లు “క్షమించ అమ్మ నిన్ను తప్పుగా అపార్థము చేసుకున్నాము అంటారు

ఆ అమ్మాయీ “నేను స్విమ్మింగ్ నేర్పించే ట్రైనీ ని నేను చీర ,డ్రెస్ వేసుకుంటే ఎలా నేర్పించగలను …చీర కట్టుకొని,లేదా చుడిదార్ లో నేర్పించడం సాధ్యం కాదు కదా!మనం వేసుకున్న దుస్తులు బట్టి ఏమి జరగవు.ఎదుటివారి మనసులో నుండి పుడుతుంది,వారిలో ఉండే తప్పుడు ఆలోచన వల్ల పెరుగుతుంది.. తప్పు చేసిసి బట్టలు చూసి ,సినిమాలు చూసి ,తాగిన మత్తులో చేసాము అంటారు  “అలాంటి వారు పసిపాప నుండి ముసిలి వారి వరకు కూడా వదిలిపెట్టలేదు …వారు తక్కువ బట్టలు వేసుకుంటారా లేదు కదా…

వేసుకునే దుస్తులు బట్టి క్యారెక్టర్ ని అంచనా వేయడం దయచేసి మానేయండి…

సీన్  4  :

ఆ ఇరుగు పొరుగు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ వైఫ్ హస్బెండ్ వచ్చి స్వీట్స్ ఇస్తారు …ఎందుకు  అంటే …మేము త్వరలో మరో బిడ్డకు తల్లి దండ్రులు కాబోతున్నాము …తాను గర్భవతి మరి మీరు ఎందుకు ఎవరో బిడ్డను పెంచుకుంటున్నారు “ఆంటీ ప్లీజ్ ఆలా మాట్లాడకండి తాను మా బిడ్డ .ఎవరో ఆవిడా  మా పాపా ని కనీ చనిపోయారు.మనం ఇలాంటివి చూసి అయ్యో అంటాము.ఏమి చేస్తే బాగా ఉంటుంది అని అనుకోము.మాకు ఉన్న డబ్బు తో మేము ఆ బిడ్డ ను చూసుకోగలము ”

మా పాపా కు రేపు పేరు పెడుతున్నాము వచ్చి మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని వాళ్ళు వెళ్ళిపోతారు .. ఇది విన్న వారి కంట్లో నీళ్లు …

సీన్  5 :

వాళ్లిద్దరూ బ్యాంక్ కు వెళ్లారు.. రేయ్ మన బ్యాంకు వాళ్ళు మెయిన్ బ్రాంచ్ కి రిక్వెస్ట్ చేసి మరి కొత్తగా మేనేజర్ ని పిలిపించుకున్నారు అంటారా…ఈ రోజు ఆయన వస్తున్నారా అంటా.. ఎలా ఉంటారో అని పాసెంజర్ మాట్లాడుకుంటే ఉంటే వచ్చిన మేనేజర్ ని చూసి షాక్ అయ్యారు ఎందుకంటే ఇంతకు ముందు ఎవరిని అయితే స్టైల్ గ లేడు ,కలర్ లేడు అని కామెంట్ చేసారో ఆ పాసెంజర్ …వారికీ అర్థం అయింది లుక్స్ ,కలర్ కాదు మీ పని మీకు గుర్తింపు ఇస్తుంది అని ..

సీన్  6  :

ఏవండీ ఈ రోజు నేను మార్కెట్ కి వెళ్ళాను ఒకడు నన్ను చూసి ఆంటీ మీరు ఇప్పుడే ఇలా ఉన్నారు అంటే యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవారో ? అప్పుడు మీ వెనుక చాలా మంది పడి ఉంటారు కదా అని ఇలా పిచ్చిపిచ్చి గ బిహావ్ చేసారు ..సరే అని లోపలకి వెళ్లి …కూరగాయలు తీసుకొని వస్తుంటే ఇంకో అతను డాష్ ఇచ్చాడు ,కూరగాయలు అన్ని కింద పది పోయాయి అని నేను తీస్తూ ఉంటే కావాలనే తాను నాకు హెల్ప్ చేస్తునట్టు నటించి నా చేతులను గట్టిగా పట్టుకున్నాడు.ఆడవాళ్ళకు కి బాగా తెలుస్తుంది ఎవరు తనని ఏఏ ఉదేశ్యంతో చూస్తున్నారు అని చెప్పి స్నాక్ తీసుకొని తింటూఉంటుంది ..

తండ్రి కొడుకులు ఇద్దరికి కోపం వచ్చేసి అమ్మ ఎందుకు ఊరుకున్నావు నువ్వు మాకు కాల్ చేసి ఉంటె వాళ్ళ  పని మేము చూసుకునే వాళ్లము కదా …

కన్న మీ అమ్మ ను అలా అంటే  నీకు చాల బాధగ ఉందే మరి నువ్వు సినిమా లో హీరోయిన్ చూసి కామెంట్ చేసినప్పుడు ఏమైంది తాను ఒక అమ్మాయీ కదా .నేను ఎలా లెక్చర్ గ వర్క్ చేస్తూ ఉన్నానో వాళ్ళు ఆలా హీరోయిన్ గ జాబ్ చేస్తున్నారు.అది వాళ్ళ వృత్తిధర్మం.అనుష్కాను చూస్తున్నావు గ వాళ్ళ బయటకు వచ్చినప్పుడు ఎంత పద్ధతిగా డ్రెస్ వేసుకుంటారో.ఇంతక ముందు నువ్వు న్యూస్ లో వచ్చిన న్యూస్ ని నువ్వు మీ డాడీ అన్ని సామిజికమాద్యమాలొ పోస్ట్ చేస్తున్నావు అలాగే వేరే  వాళ్ళను కామెంట్ చేస్తున్నావు ఏంటి ఇది అసలు? శారీరకంగా బాధించి ఆనందం పొందటమే కాదు ,మానసింగా బాధించడం కూడా రేప్ కిందేనే లెక్క..మీ అమ్మను కామెంట్ చేస్తే నీకు ఎంత బాధ అనిపించింది అలాగే కదా నువ్వు కామెంట్ చేసే అమ్మాయీ కూడా వేరే  వాళ్ళ అక్క ,చెల్లలు కదా వాళ్ళు కూడా అంతే  బాధ పడతారు కదా అర్థం అయిందా .కన్న ఫస్ట్ మన మెంటాలిటీని మార్చుకోవాలి .స్టేటస్ లో పెట్టడం గొప్ప కాదు. అలా  జరగకుండా అందరి మైండ్ సెట్ ని మార్చాలి ..అర్థం అయిందా .. తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా వాళ్ళ చేసిన తప్పు ఏంటో అర్థం  అయింది …

“మనలో ఉంది తప్పు ఎంత సైపు మనమే ఎదుటివారిలో లోపాలను ,తప్పులను వెతకడం చేస్తుంటాము అది మానుకోవాలి …మార్పు అనేది ఎక్కడి నుండో రాదు మన లోంచి రావాలి”

సీరియల్ లో .మూవీస్ లో విలన్స్ ని తిట్టటం చేస్తాము ..కానీ రియల్ లైఫ్ లో మనము కూడా విలన్ లాగా  ప్రవర్తిస్తుంటాము….

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!