హెచ్చరికో…హెచ్చరిక

(అంశం:” ప్రమాదం”)

హెచ్చరికో…హెచ్చరిక

రచన::చంద్రకళ. దీకొండ

“పచ్చలైటు వెలిగాకే రోడ్డు దాటండి”
“వేగము కన్న ప్రాణము మిన్న”
“ముందర మూలమలుపు ఉన్నది”
“జాగ్రత్తగా వాహనం నడపండి”…
“శిరస్త్రాణం ధరించండి”
“సీట్ బెల్ట్ పెట్టుకోండి”
హెచ్చరిక బోర్డులెన్ని ఎదురుగా కనబడుతున్నా లెక్కచేయక…!
అతివేగంతోనో…
చరవాణిలో మాట్లాడుతూనో…
మద్యం తాగి వాహనం నడుపుతోనో…
నిబంధనలకు మించిన
ప్రయాణీకులను ఎక్కించుకునో…!
కాలం చెల్లిన వాహనం వల్లో…
శిక్షణ లేని వాహన చోదకుని వల్లో…
ఎదుటి వారి తప్పిదం వల్లో…!
ఒక్కని చేతిలో వందల ప్రాణాలున్నాయనే బాధ్యత మరచి…
బాధ్యతా రాహిత్యం…
దూర ప్రయాణ అలసట…
మద్యపాన ప్రభావం కలగలిసి…!
వందల ప్రాణాలు గాల్లో కలుస్తాయ్…
నమ్ముకున్నవారి ఆశలను
వమ్ము చేస్తాయ్…
వీక్షించిన వారి హృదయాలను కలచివేస్తాయ్…!
ఉల్లాస ప్రయాణ ప్రమోదం…
అవుతుంది విషాదం గొలిపే ప్రమాదం…!
అందుకే గమనించాలి రహదారిని…
ఏకాగ్రతతో నడపాలి వాహనాన్ని…
జ్ఞప్తిలో ఉంచుకోవాలి అజాగ్రత్త
వల్ల జరిగిన ప్రమాదాలని…
మనసులో నిలుపుకోవాలి
ఇంటిలోనివారి జీవితాలని…!

హెచ్చరికో… హెచ్చరిక…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!