ముప్పు

(అంశం:” ప్రమాదం”)

ముప్పు

రచన::సావిత్రి కోవూరు 

మద్యం మత్తులో తూగుతూ, వాహనాన్ని నడిపి అదుపు తప్పి అనంత లోకాలకు పయనమయ్యే వారెందరో,

అదుపులేని, అతివేగం ఆనందాన్నిస్తుందని వెళ్ళావా,

అందనంత దూరానికి వెళ్లి, మీ అమ్మానాన్నలకే కాక, ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చి ఆరని దుఃఖాన్నిస్తుంది,

దిక్కులేని కుటుంబాలను చేసి, నడివీధిన పడేస్తుంది.

అలక్ష్యం, నిర్లక్ష్యం తెస్తుంది, ప్రమాదాల ముప్పు పసి ప్రాణాలకు

నీటి గుంటలు, వాటర్ హీటర్లు, సంపులు, బోరు బావులు,

ప్రాణాలు తీసే దుష్టులు పిల్లల ప్రాణాలు హరించే యమపాశాలు.

ఆడవాళ్ళు అప్రమత్తత లేక ఆదమరిస్తే ఆమె కాలి గోటికి సరిపోని,

అజ్ఞానులు కూడా మృగాళ్లై, కన్ను మిన్ను కానక, తోటి మనిషని చూడక, కరుణ అసలే లేక, కాటువేసే విషసర్పాలై, రాక్షసులై జీవితాలనే కాలరాస్తున్నారు.

కాసులు కురిపించే కంపెనీలు, లంచాలు ఇచ్చి, లైసెన్సులు పొంది,

నిర్లజ్జగా వ్యర్ధాలను అమృత జలాలలో వదిలి, జలాలను గరళంగా మార్చేస్తున్నారు.

ఫ్యాక్టరీలు వదిలే విషవాయువులే  పైకెగసి ఓజోన్ పొరను కరిగించి క్యాన్సర్ల ముప్పును తెస్తున్నాయి.

మానవుడు అజ్ఞానంతో ప్రకృతిని పాడు చేసి తెచ్చుకుంటున్నారు కొన్ని ప్రమాదాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!