ప్రశాంత జీవితము

ప్రశాంత జీవితము

రచయిత :: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు ప్రతాపం ఆకాశంలో మరీ ఎక్కువ ఉంది ఉదయం అరు గంటలకు రబ్బరు ట్యూబ్ తో మొక్కలకు నీళ్ళు పెడుతున్నాడు శ్రీవెంకటేశ్వర రావు. డిల్లీ ఇంజినీరింగ్ కాలేజ్ లో.ప్రొఫెసర్ చేసి రిటైర్ అయి వచ్చాడు .చతుర్వేదముల వలె నల్గురు కూతుళ్లు కొడుకులు లేరు. నల్గురు కూతుళ్ళని చదివించాడు పెద్ద అమ్మాయి వాసంతి పిజి చేస్తుండగా తన ఫ్రెండ్ కొడుకు తన దగ్గర ఇంజనీర్ చదివి కెనడాలో స్థిర పడ్డాడు సుధీర్ కి చాలా గౌరవం మర్యాద తెలుసు అందుకు తన కూతుర్ని చెయ్యాలని ఆశా పడి వాళ్ళఅమ్మా నాన్నకు ఫోన్ చేశాడు.అవతలనుంచి అంతకంటె నా స్నేహితులం వియ్యమందుతున్నము నీకు నేను సరిపోగలనా అన్నాడు.

అదేమిటి రామం నువ్వు ఇప్పుడు మగ పిల్లాడి తండ్రివి పెద్ద కొడుకు పెళ్లి ఏమి కావాలి ఎంత ఘనంగా చెయ్యాలి అని ఆలోచించాలి గాని సరి పోక పోవడ మేమిటి? అని ప్రస్నించాడు
ఉరే నువ్వు నీ కూతుర్ని ఇస్తానంటే కాదంటానా అన్నాడు కట్నాలు ఏమి వద్దు.నా ఆడపిల్లకు అడబడుచు లాంచనాలు నేను ఇస్తాను నీ పిల్లే మహా లక్ష్మి అంటూ ఆప్యాయంగా కలుపుకున్నారు

రెండో పిల్లని అక్క కొడుకు సింగ పూర్ లో ఇంజనీర్ కి చేశాడు మూడో పిల్ల డాక్టర్ తనతో చదివిన దూరపు బంధవుల అబ్బాయిని చేసుకుంటాను అన్నది అతనికే చేశాడు నాల్గో పిల్ల మంచి పెయింటర్ శాంతి నికేతన్ లో చదివింది మినిస్ట్రీలో పనిచేస్తున్న అబ్బాయికి చేశాడు అతను తనతో చేసే ప్రొఫెసర్ కొడుకు అల పిల్లల జీవితాలు సెటిల్ చేశాడు రిటైర్ అయ్యాక ఇంక ఢిల్లీలో ఉండటం ఇష్టం లేకపోయి తన పుట్టిన ఊరు వెళ్లి పోతానని అన్నప్పుడు అక్కడి వారు అంతా కలిసి వెళ్ళా వద్దు అని శతవిధాల చెప్పారు పిల్లలు కూడా నాన్న నువ్వు దూరం వెడితే ఎలా మేము రావడం కష్టం మీరు డిల్లీ కాకపోతే విమాన ప్రయాణంలో సులువు ఉన్న ఊరిలో ఉంటే మేము వచ్చి వేళ్ళ డా నికి అనుగుణంగా ఉంటుందని బ్రతి మాలాగా తప్పని సరి అయ్యి వప్పుకుని విజయ వాడ దగ్గరే కనుక పల్లెటూరు అక్కడ కాక విజయవాడలో ఇల్లు కొని అన్ని ఏర్పాట్లు చేసుకుని భార్యా భర్త లిద్దరూ ఉన్నారు
పల్లెటూరి ఇల్లు కూడా బాగులు చేయించి ఓ లేని కుటుంబానికి ఇచ్చాడు రెండు రోజుల కొకసారి వెళ్ళి అక్కడి మొక్కల మధ్య సేవ చేస్తూ ఉంటాడు .

నేను ఇంత వరకు ఢిల్లీ లో బిజీ జీవితం ఊపిరి సలపకుండా జీవించాను నాకు ఖరీదైన కారు హోదా అన్ని ఉన్నాయి అవన్నీ వదిలి నా అంద్రలో వరి అన్నం పెరుగు తినాలని కోరిక ప్రశాంతం గా ఉండాలి గడియారంలో పాటు ముప్పై అయిదు ఏళ్ళు పరుగెత్తింది జీవితము ఇప్పుడు సూర్యోదయం సూర్య అస్తమయం చూస్తూ పక్షుల కిల కిలా రావాలు వింటు గడుపుతున్నాను

ఆ బహుళ అంతస్తుల భవనాల్లో జీవితం గడపడం మహా కష్టం గా ఉండేది పిల్లల పెంపకం చదువులు అన్నినువ్వు.కూడా చూసావు ఇంకా వాన ప్రస్త ఆశ్రమం లో నిచ్చింత గా జీవించాలి పిల్లలు వాళ్ళ కుటుంబాల్లో ఎంతో హాయిగా ఉన్నారు మంచి అల్లుళ్ళు వచ్చి చూస్తున్నారు ఆకరు పిల్ల కూడా బాగానే ఉంది ఇద్దరు పిల్లలు మనం ఇంకా వారి కుటుంబాల్లో కి వేళ్ళ కూడదు
మన జీవితం మనం చూసుకోవాలి అంటాడు

విజయవాడలో తనతో చదివిన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు రిటైర్ అయ్యి మళ్లీ జాబ్స్ లో చేరారు.నువ్వు విజయ వాడ రావడం ఎంతో ఆనందంగా ఉంది నువ్వు కూడా ఐ ఐ టీ లో చేసి వచ్చావు మాటల నీ తెలివి నువ్వు కూడా మాతో ఒక కాలేజి లో జాయిన్ కా అన్నారు
నో నో నేను ఎవరికోసం ఉద్యోగం చెయ్యాలి సర్వీస్ అయింది ఇంక నాకు మొక్కల మధ్య హాయిగా పురాణాలు చదువుతూ బ్రతీ కేస్తాను ఇంక బాదరబంది అనవసరము అని నేవ్వే వాడు వారానికి ఒక సారి అంతా పార్క్ లో కలిసేవారు .

ఒక రోజు ఆనందంగా ఉండాలి అంటే మహారాజు అవ్వాలి
రెండ్రోజులు హాయిగా ఉండాలి అంటే ఒక కవి అవ్వాలి
జీవిత కాలం హాయిగా ఉండాలి అంటే ఒక తోట మాలి అవ్వాలి

అని ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు కనుక చక్కగా మొక్కల పని చూసుకుంటూ జీవిస్తాను అంటాడు బంధువుల పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్స్ కి భార్య భర్త వెడతారు ఓవేయ్యి నూట పదహారు లు చదివిస్తారు మర్యాదగా ఘనంగా నలుగురు ముందు గౌరవం పొందుతారు నా అంద్రాలో నేను హాయిగా ఉన్నాను అంటాడు అలాగే ఆరోగ్యంగా మొగుడు పెళ్ళాం ఒక లేని కుటుంబాన్ని చేరదీసి ఇంట్లో పెట్టుకున్నారు భార్య వంట పని చేస్తుంది భర్త పొలం పని చూసి వస్తాడు. వేంకటేశ్వర రావు మాత్రం హాయిగా సాయంత్రం సైకిల్ పై మార్కెట్కు వెళ్లి పళ్ళు కూరలు తానే తెస్తాడు అక్కడి బజారులో ఎవరైనా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ చూస్తే ఓ నమస్కారం పెడతారు లేకపోతే సామాన్య వ్యక్తి లా సైకిల్ పై వెళ్ళి పోతాడు అటువంటి సింపుల్ లైఫ్ కావాలి అన్నది ఆయన ధ్యేయం కూడా..

కాల గమనంలో ఎనబై నాలుగు ఏళ్ళు వచ్చాయి పిల్లలు అంతా కలిసి సహస్ర చెంద్రో దయము చెయ్యాలని అభిలాష పడ్డారు అలాగే విదేశాల మనుమలు అల్లుడు కూతుళ్లు అందరూ వచ్చారు ముందు ఎందుకు అన్నాడు కానీ వళ్ళు ఇండియా వచ్చి అన్ని అర్రంజ్ మెంట్స్ చేశారు
విజయవాడ అనగానే దుర్గమ్మ గుడి కృష్ణ బ్యారేజి అందరికీ ఇష్టమే అక్కడ పూజ చేయించి వచ్చారు ఇంట్లో హోమాలు శ్రీ రమా సత్యనారాయణ వ్రతము
శ్రీ అలిమేలు మంగా పద్మావతి సహిత వేంకటేశ్వర స్వామి దీపారాధన చేసి ఘనంగా భోజనాలు అన్ని పెట్టారు వచ్చిన స్నేహితులకు బంధువులకు కొత్త బట్టలు పెట్టారు రిటర్న్ గిఫ్ట్ గా వెండి కమలాలు పంచి పెట్టారు
ఆడ పిల్లల పెళ్ళిళ్ళు అన్ను ఢిల్లీ లోనే చేశాడు ఎన్నాళ్ళ తర్వాత తన ఇంట్లో ఇంత గొప్ప వేడుక చేశాడు ఎప్పుడు వాళ్ళు వెళ్లడమే గానీ పిల్లల్ని మనుమల్ని ఇప్పుడే అంతా చూడటము
ఎంత విద్య వంతులైన తమ సొంత ఊరిని భారతీయ సాంప్రదాయాన్ని వదలకూడదు అని చేతల్లో చూపించారు అడ పిల్లలు అయిన సరే అన్ని అందుకుని అడుకు నీ చూశారు
అందుకే ఇప్పుడు చాలామంది రిటైర్ అయ్యాక సొంత ఉరు రావడానికి ఇష్టత చూపిస్తున్నారు మనం మన భారతీయత మరువ కూడదు కదా సర్వే జనా సుఖినో భవంతు శాంతి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!